చైనాకు మరో ఎదురుదెబ్బ

July 20, 2020


img

కరోనాతో యావత్ ప్రపంచానికి తీరని నష్టం కలిగించినందుకు చైనాలో ఏమాత్రం అపరాధభావం లేకపోగా లద్దాక్‌లోని గాల్వాన్ లోయలో నియంత్రణరేఖ దాటి భారత్‌లోకి ప్రవేశించి 22 మంది జవాన్లను అతికిరాతకంగా హత్య చేసింది. అందుకూ చైనా పాలకులు ఏమాత్రం పశ్చాత్తాపం వ్యక్తం చేయలేదు. కరోనాను ప్రపంచదేశాలకు అంటగట్టినందుకు వాటి ముందు దోషిగా నిలబడవలసిన పరిస్థితి ఏర్పాటడంతో ఈ సమస్య నుంచి ప్రపంచదేశాల దృష్టిని మళ్లించేందుకు చైనా ఈ సాహసానికి పూనుకొందని అర్ధమవుతూనే ఉంది.చైనా ఉత్పత్తులను నిషేదించకుండా భారత్‌పై ఒత్తిడి చేసేందుకు కూడా చైనా ఈ దుందుడుకు చర్యకు పూనికొని ఉండవచ్చనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. కానీ అది ఆశించిన రెండు ప్రయోజనాలు కూడా సిద్ధించకపోగా దాని ప్రయత్నాలు బెడిసికొట్టాయి.

ఈసారి భారత్‌ ధీటుగా బదులిస్తుందని ఊహించని చైనాకు గాల్వాన్ నుంచి సేనలు ఉపసంహరించుకోవలసి రావడంతో మొదటి ఎదురుదెబ్బ తగిలింది. నిజానికి కరోనా అంటించినా భారత్‌ ప్రభుత్వం, ప్రజలు సహించారు కానీ 22 మంది జవాన్లను అతికిరాతకంగా హత్య చేయడం జీర్ణించుకోలేకపోయారు. అందుకే భారత ప్రభుత్వం 59 చైనా మొబైల్ యాప్‌లు, వరుసగా అనేక ఒప్పందాలను రద్దు చేసుకోవడంతో చైనాకు మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. వరుసగా ఇన్ని ఎదురుదెబ్బలు తిన్న తరువాత కూడా చైనా బుద్ధిమారకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. 

నేపాల్, పాకిస్తాన్, ఇరాన్‌లో దేశాలతో కలిసి భారత్‌కు వ్యతిరేకంగా కుట్రలు పన్నడం ప్రారంభించింది. హిందువుల ఆరాధ్యదైవం శ్రీరాముడు అయోధ్యలో పుట్టలేదని నేపాల్లో పుట్టాడని, బీహార్ రాష్ట్రంలో కొన్ని ప్రాంతాలు తమవేనని  నేపాల్ ప్రధాని ఓలీ వితండవాదం ఆ కుట్రాలలో భాగమేనని భావించవచ్చు. 

చైనా, పాకిస్థాన్‌, ఇరాన్‌లో మూడు కలిసి ఒకేసారి భారత్‌పై సైనిక, ఉగ్రదాడులు జరపాలని ప్రయత్నిస్తున్నట్లు భారత్‌ నిఘావర్గాలు పసిగట్టాయి. దాంతో భారత్‌ ప్రభుత్వం అమెరికా, ఇజ్రాయెల్, ఫ్రాన్స్ దేశాల మద్దతు కూడగట్టి వాటితో చైనాకు గట్టి వార్నింగ్ ఇప్పించగలిగింది. 

అంతేకాదు... భారత్‌, అమెరికా నావికాదళాలు సంయుక్తంగా అండమాన్ మరియు నికోబార్ ద్వీపాల వద్ద ఈ నెల 22న ‘పాసెక్స్’ పేరుతో భారీ నావికావిన్యాసాలు నిర్వహించనున్నాయి. అమెరికాకు చెందిన యుఎస్ఎస్ నిమిట్జ్ యుద్ధనౌక ఇప్పటికే అక్కడకు చేరుకోగా, అంతకంటే భారీ యుద్ధనౌక యుఎస్ఎస్ రోనాల్డ్ రీగన్ కూడా నేడో రేపో అండమాన్ దీవుల వద్దకు చేరుకోబోతోంది. భారత్‌కు చెందిన అగ్రశ్రేణి యుద్ధనౌకలు ఈ నావికావిన్యాసాలలో పాల్గొనేందుకు అక్కడకు చేరుకొంటున్నాయి. భారత్‌తో పెట్టుకొంటే ధీటుగా బదులిస్తామని చైనాకు స్పష్టమైన సంకేతాలు పంపడానికే ఈ విన్యాసాలని వేరే చెప్పక్కరలేదు. అంతేకాదు భారత్‌కు అండగా అమెరికా ఉంటుందని చైనాకు చెప్పినట్లే భావించవచ్చు.


Related Post