నిమ్స్‌లో క్లినికల్ ట్రయల్స్ షురూ

July 20, 2020


img

హైదరాబాద్‌ కేంద్రంగా పనిచేస్తున్న భారత్‌ బయోటెక్ కంపెనీ కరోనా నివార కోసం తయారుచేసిన ‘కోవాక్సిన్’  వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్‌ నేటి నుంచి నిమ్స్‌లో మొదలయ్యాయి. ఈరోజు నిమ్స్‌ వైద్యుల పర్యవేక్షణలో దాని మొదటిడోసు ఇద్దరు వాలంటీర్లకు  వాలంటీర్లకు ఇచ్చారు. వారిపై దాని ప్రభావం ఏవిధంగా నిశితంగా గమనించి ఎటువంటి దుష్ప్రభావాలు కనబడకపోతే తరువాత మరికొందరికి కోవాక్సిన్ దోసూలు ఇస్తారు. ఈ ప్రక్రియ సుమారు నెలరోజులపాటు సాగవచ్చునని సమాచారం. నెలరోజులలో ఈ వ్యాక్సిన్‌ కరోనాను అడ్డుకోగలదో లేదో తేలిపోతుంది. ఒకవేళ అడ్డుకోగలిగితే, దానికి కేంద్రప్రభుత్వం ఆమోదం తెలుపవలసి ఉంటుంది. ఆ తరువాత దాని ఉత్పత్తి ప్రారంభిస్తారు. ఒకవేళ ఈ కోవ్యాక్సిన్‌ సత్ఫలితాలు ఇచ్చినట్లయితే మరో 3-4 నెలల్లో అది దేశంలో అందుబాటులోకి రావచ్చు. కానీ అప్పటివరకూ కరోనా మహమ్మారి ప్రజల జీవితాలతో, ప్రాణాలతో ఆడుకొంటూనే ఉంటుంది. కనుక అప్పటివరకూ అందరూ దానిని తప్పించుకొంటూ జీవించవలసి ఉంటుంది.   



Related Post