17 బ్యాంకులకు రూ.47,350 కోట్లు ఎగవేసిన బడాబాబులు

July 20, 2020


img

సామాన్య ప్రజలు చిన్నపాటి రుణాలు తీర్చకపోతే బలవంతంగా వడ్డీలతో సహా వసూలుచేసుకొనే బ్యాంకులు బడా బాబులు వేలకోట్లు రుణాలు తీసుకొని ఎగవేస్తున్నా వారిని ఏమీ చేయలేక వాటిని మొండి బకాయిల పద్దులో వ్రాసుకొని రద్దు చేస్తున్నాయి. కనీస నగదునిలువ, బ్యాంక్, ఎటిఎం లావాదేవీ ఛార్జీలు వంటి రకరకాల పేర్లతో ఆ భారాన్ని సామాన్య ప్రజలపై మొపుతుండటం అందరికీ తెలిసిందే. రుణాల పేరిట ఈ దోపిడీ దశాబ్ధాలుగా కొనసాగుతున్నా బ్యాంకులు నేటికీ అటువంటి వారికి రుణాలు ఇస్తూనే ఉండటం చాలా విడ్డూరం. ఏటా ఈవిధంగా ఉద్దేశ్యపూర్వకంగా రుణాలు ఎగవేస్తున్నవారిని బ్యాంక్ అసోసియేషన్ గుర్తించి ఆ జాబితాను ప్రకటిస్తుంటుంది. సెప్టెంబర్ 2019 వరకు 17 బ్యాంకులలో 2,426 అకౌంట్ల ద్వారా మొత్తం రూ.47,350 కోట్లు ‘ఉద్దేశ్యపూర్వకంగా ఎగవేసినట్లు’ ప్రకటించింది. వాటిలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక్కదానికే రూ.43,887 కోట్లు బడాబాబులు కుచ్చుటోపీ పెట్టారు.   

1. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా:  685 ఖాతాల ద్వారా రూ.43,887 కోట్లు ఎగవేత

2. పంజాబ్ నేషనల్ బ్యాంక్: 325ఖాతాల ద్వారా రూ. 22,370 కోట్లు

3. బ్యాంక్ ఆఫ్ బరోడా: 355 ఖాతాల ద్వారా రూ. 14,661 కోట్లు

4. బ్యాంక్ ఆఫ్ ఇండియా: 184 ఖాతాల ద్వారా రూ.11,250 కోట్లు  

5. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా: 69 ఖాతాల ద్వారా రూ.9,663 కోట్లు   

6. యునైటడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా: 128 ఖాతాల ద్వారా రూ.7,028 కోట్లు   

7. యూకో బ్యాంక్: 87 ఖాతాల ద్వారా రూ.6,813 కోట్లు   

8. ఓబీసీ బ్యాంక్: 138 ఖాతాల ద్వారా రూ.6,549 కోట్లు   

9. కెనరా బ్యాంక్: 96 ఖాతాల ద్వారా రూ.5,276 కోట్లు   

10. ఆంధ్రా బ్యాంక్: 84 ఖాతాల ద్వారా రూ.5,165 కోట్లు   

11. అలహాబాద్ బ్యాంక్: 57 ఖాతాల ద్వారా రూ.4,339 కోట్లు   

12. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్: 49 ఖాతాల ద్వారా రూ.3,188 కోట్లు   

13. కార్పొరేషన్ బ్యాంక్: 58 ఖాతాల ద్వారా రూ.2,450 కోట్లు   

14. ఇండియన్ బ్యాంక్: 27 ఖాతాల ద్వారా రూ.1,613 కోట్లు   

15. సిండికేట్ బ్యాంక్: 36 ఖాతాల ద్వారా రూ.1,438 కోట్లు   

16. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర: 42 ఖాతాల ద్వారా రూ.1,405 కోట్లు   

17. పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్: 6 ఖాతాల ద్వారా రూ.255 కోట్లు. 


Related Post