సచివాలయం కూల్చివేతకు హైకోర్టు మళ్ళీ గ్రీన్‌ సిగ్నల్‌

July 17, 2020


img

సచివాలయం కూల్చివేతకు హైకోర్టు మళ్ళీ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ప్రొఫెసర్ విశ్వేశ్వరరావు వేసిన పిటిషన్‌పై నేడు మళ్ళీ విచారణ చేపట్టిన హైకోర్టు, సచివాలయం కూల్చివేతకు పర్యావరణ అనుమతులు అవసరం లేదనే ప్రభుత్వ అడ్వకేట్ జనరల్ ప్రసాద్ వాదనలతో ఏకీభవిస్తూ కూల్చివేతకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చేసింది. సచివాలయం కూల్చివేతను వ్యతిరేకిస్తూ కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి వేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కూడా కొట్టివేసింది. హైకోర్టు, సుప్రీంకోర్టులు సచివాలయం కూల్చివేతకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చేశాయి కనుక కాంగ్రెస్‌ ఎంపీ రేవంత్‌ రెడ్డి చెన్నైలో జాతీయ గ్రీన్‌ ట్రిబ్యూనల్ వేసిన పిటిషన్‌ను కూడా కొట్టిపారేసే అవకాశం ఉంది. దాంతో సచివాలయం కూల్చివేతకు అన్ని అవరోధాలు తొలగిపోయినట్లే భావించవచ్చు. 



Related Post