తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం

July 15, 2020


img

తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకొంది. ఇప్పటివరకు కరోనా రోగులకు ప్రభుత్వాసుపత్రులలో ఇచ్చితంగానే కరోనా పరీక్షలు, చికిత్సలు అందజేస్తున్న సంగతి తెలిసిందే. కానీ రాష్ట్రంలో కరోనా రోగుల సంఖ్య నానాటికీ పెరుగుతుండటంతో ప్రభుత్వాసుపత్రులపై ఒత్తిడి పెరుగుతోంది. కనుక ఇకపై కరోనా రోగులకు ప్రైవేట్ ఆసుపత్రులలో కూడా ఉచితంగా పరీక్షలు, చికిత్స అందజేయాలని నిర్ణయించింది. ప్రయోగాత్మకంగా మల్లారెడ్డి, కామినేని, మమతా ప్రైవేట్ మెడికల్ కాలేజీలకు అనుబందంగా ఉన్న ఆసుపత్రులలో ఉచితంగా పరీక్షలు, చికిత్స అందజేయాలని నిర్ణయించింది.

కరోనాను ఆరోగ్యశ్రీ పధకంలో చేర్చకూడదని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించడం వలన రోగులు ప్రభుత్వాసుపత్రులకు క్యూకడుతున్నారని చెప్పవచ్చు. కానీ ఇప్పుడు మూడు ప్రైవేట్ ఆసుపత్రులను అనుమతించడం ద్వారా కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చినట్లయింది. కనుక అవసరమైతే మున్ముందు మరిన్ని ఆసుపత్రులను అనుమతించవచ్చు. దీని వలన ప్రభుత్వంపై చాలా ఆర్ధికభారం పడవచ్చు కానీ రాష్ట్రంలో కరోనా సోకి చికిత్స చేయించుకోలేని దుస్థితిలో ఉన్న నిరుపేదలు, సామాన్య ప్రజల ప్రాణాలకు భద్రత కల్పించినట్లవుతుంది. 


Related Post