ప్రియాంకా వాద్రాకు గడువు నెల రోజులు

July 01, 2020


img

సీనియర్ కాంగ్రెస్‌ నాయకురాలు ప్రియాంకా వాద్రాను నెలరోజులలోగా ఇల్లు ఖాళీ చేయమని కోరుతూ కేంద్రం ఈరోజు నోటీస్ పంపింది. ప్రస్తుతం ఆమెకు ఎస్పీజీ భద్రతలో లేరు కనుక 35, లోడీ ఎస్టేట్స్ బంగ్లాను ఈనెలాకారులోగా ఖాళీ చేయాలని కేంద్ర పట్టణ, గృహనిర్మాణ శాఖ బుదవారం నోటీస్ పంపించింది. ఒకవేళ అప్పటిలోగా ఖాళీ చేయకపోతే జరిమానా విధించవలసి ఉంటుందని నోటీసులు పేర్కొంది.

ప్రభుత్వం కేటాయించిన బంగ్లాలో ఉన్నవారు పదవికి రాజీనామా చేసినా లేదా పదవి కోల్పోయినా లేదా ఇతరత్రా కారణాల చేత అందులో ఉండేందుకు అనర్హులైనా వాటిని ఖాళీ చేసి ప్రభుత్వానికి అప్పగించాలి. కానీ మనరాజకీయనాయకులలో చాలా మంది పదవి, అధికారం కోల్పోయినా కూడా ప్రభుత్వం కేటాయించిన బంగ్లాను ఖాళీ చేయకుండా ఉపయోగించుకొంటుంటారు.

ప్రియాంకా వాద్రా ప్రజాప్రతినిధి కాదు కానీ ఆమెకు ఎస్పీజీ భద్రత కలిగి ఉన్నందున దానిలో ఉంటున్నారు. అయితే ఇటీవలే కేంద్రప్రభుత్వం ఆమెకు ఎస్పీజీ భద్రతను ఉపసంహరించుకొంది. కనుక ప్రభుత్వం నుంచి ఇటువంటి నోటీస్ అందుకోక ముందే ఖాళీ చేసినా  లేదా చేయబోతున్నట్లు ప్రభుత్వానికి తెలియజేసినా హుందాగా ఉండేది. కనీసం ఇప్పుడైనా ఖాళీ చేస్తారో లేక మోడీ ప్రభుత్వం తమపై ఈవిధంగా రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడుతోందని ఎదురుదాడి చేస్తారో?


Related Post