అంతర్జాతీయ విమానసేవలపై నిషేధం కొనసాగింపు

June 26, 2020


img

మార్చి 23వ తేదీ నుంచి అంతర్జాతీయ విమాన సేవలపై నిషేధం కొనసాగుతోంది. అయితే కరోనా వైరస్ అంతకంతకూ విజృంభిస్తుండటంతో జూలై 15వరకు అంతర్జాతీయ విమాన సేవలపై నిషేధం కొనసాగిస్తున్నట్లు డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) ఈరోజు ప్రకటించింది. అయితే అంతర్జాతీయ కార్గో విమానాలకు, విదేశాలలో చిక్కుకొన్న భారతీయులను తీసుకువస్తున్న వందే భారత్ ప్రత్యేక విమానసేవలకు, అలాగే దేశీయ విమానసేవలకు ఈ నిషేధం వర్తించదని తెలిపింది. 

ఇక భారతీయ రైల్వే కూడా ఆగస్ట్ 12 వరకు సాధారణ రైళ్లపై నిషేధం కొనసాగిస్తున్నట్లు ప్రకటించింది. కనుక జూలై 1 నుంచి ఆగస్ట్ 12 వరకు బుక్‌ చేసుకొన్న టికెట్లన్నిటినీ రద్దయినట్లు ప్రకటించింది. టికెట్ల తాలూకు సొమ్మును ప్రయాణికులకు వాపసు చేస్తామని ప్రకటించింది. అయితే 200 ప్రత్యేక రైళ్లు, 30 రాజధాని ఎక్స్‌ప్రెస్‌లు యధాతధంగా నడుస్తాయని కనుక వాటి రిజర్వేషన్ ప్రక్రియ యధాతధంగా కొనసాగుతుందని రైల్వేశాఖ తెలిపింది.



Related Post