రైతుల ఖాతాల్లోకి రైతుబంధు నగదు జమా

June 23, 2020


img

తెలంగాణలో రైతులకు ఓ శుభవార్త! మంగళవారం రాష్ట్రంలో 50.84 లక్షల మంది రైతుల ఖాతాలలో రైతుబంధు సొమ్ము జమా చేసింది. రిజర్వ్ బ్యాంక్ ‘ఈ-కుబేర్’ సాఫ్ట్‌వేర్‌ ద్వారా రాష్ట్రంలో వివిద బ్యాంకులలో రైతుల ఖాతాలలో సోమవారం రాత్రి డబ్బు జమా అయ్యింది. డబ్బు జమా అయినట్లు రైతుల మొబైల్ ఫోన్లకు బ్యాంకుల నుంచి మెసేజులు కూడా వస్తున్నాయి. రాష్ట్రంలో మొత్తం 59 లక్షల మంది అర్హులైన రైతులుండగా, వారిలో 5 లక్షలమంది బ్యాంక్ ఖాతాలలో ఇబ్బందులు, ఆధార్ లింకింగ్, మొబైల్ ఫోన్‌ నెంబర్లలో తేడాలు ఉండటం వంటి కారణాల వలన వారికి మాత్రం రైతుబంధు చెల్లింపులు జరుగలేదు. ఆ లోపాలను సవరించుకొని వ్యవసాయశాఖకు తెలియజేస్తే వారికి కూడా రైతుబంధు చెల్లించడానికి సిద్దంగా ఉన్నామని ఆ శాఖ ఉన్నతాధికారులు చెప్పారు. రైతు బంధు పధకం కింద వర్షాకాలం సీజనులో ఎకరానికి రూ.5,000 చొప్పున ఎంత వ్యవసాయభూమి ఉంటే అంతకు తగ్గ సొమ్మును ప్రభుత్వం చెల్లిస్తోంది.



Related Post