ఏపీలో ఆగని కరోనా...ఆగని రాజకీయాలు

June 11, 2020


img

ఏపీలో ఓ పక్క కరోనాతో ప్రజలు, ప్రభుత్వం తిప్పలు పడుతున్నప్పటికీ, అధికార వైసీపీ, ప్రతిపక్ష టిడిపిల రాజకీయాలు మాత్రం ఆగడం లేదు. టిడిపి అధినేత చంద్రబాబునాయుడు, ఆయన కుమారుడు నారా లోకేశ్ ఇద్దరూ హైదరాబాద్‌ నుంచి విజయవాడ తిరిగి వచ్చినప్పటి నుంచి రెండు పార్టీల మద్య మాటల యుద్ధం ఇంకా తీవ్రమైంది. టిడిపి నేతలను వైసీపీలోకి ఆకర్షించి దెబ్బ తీయాలని వైసీపీ ప్రయత్నిస్తుంటే, వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ టిడిపి దూసుకుపోతోంది. 

రెండు పార్టీల మద్య యుద్ధం ఇప్పుడు పతాకస్థాయికి చేరినట్లుంది. టిడిపి అధ్యక్ష పదవి నుంచి చంద్రబాబునాయుడు తప్పుకొని ఆ ముళ్ళ కిరీటాన్ని యువనేత రామ్మోహన్ నాయుడి నెత్తిన పెట్టేందుకు సిద్దం అవుతున్నారని, అది చూసి నారా లోకేశ్ ఆవేశపడుతున్నారంటూ వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి తెలివిగా టిడిపిలో అగ్గి రాజేసే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా నారా లోకేశ్‌పై ట్విట్టర్‌లో ఆయన అనుచిత వ్యాఖ్యలు చేశారు. వాటికి రామ్మోహన్ నాయుడు కూడా అంతేఘాటుగా వ్యాఖ్యలు చేసి వైసీపీలో జగన్, విజయసాయి రెడ్డిల మద్య చిచ్చుపెట్టె ప్రయత్నం చేయడం విశేషం. ఇంతకీ వారిరువురూ ఏమన్నారో వారి మాటలలోనే చూద్దాం.   



Related Post