కరోనాతో కలిసి బ్రతకడం నేర్చుకోక తప్పదిక

June 08, 2020


img

రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేస్తున్న హెల్త్ బులెటిన్‌లలో జీహెచ్‌ఎంసీ పరిధిలో కేసులని పేర్కొంటున్నవి రాజధాని హైదరాబాద్‌ నగరంలో కేసులని వేరే చెప్పక్కరలేదు. రాష్ట్రానికి గుండెకాయ వంటి హైదరాబాద్‌లో నానాటికీ కరోనా కేసులు పెరిగిపోతుండటం, ఇప్పుడిప్పుడే తెరుచుకొంటున్న అన్ని వ్యవస్థలను మళ్ళీ మూతపడేలా చేసే ప్రమాదం ఉంది. దాంతో రాష్ట్ర ఆర్ధికవ్యవస్థపై కూడా తీవ్ర ప్రభావం చూపే ప్రమాదం ఉంది. అయితే ఇప్పుడు దేశంలో అన్ని రాష్ట్రాలలో... ప్రపంచంలో అన్ని దేశాలలో కూడా ఇంచుమించు ఇటువంటి పరిస్థితే నెలకొని ఉందని అందరికీ తెలుసు. కరోనాను కట్టడి చేయడంలో తెలంగాణ ప్రభుత్వ ప్రయత్నలోపం ఏమీ లేనప్పటికీ రాష్ట్రంలో కరోనా తీవ్రత నానాటికీ పెరుగుతూనే ఉంది. కనుక కరోనా నివారణకు వ్యాక్సిన్ వచ్చే వరకు కరోనాతో కలిసి బ్రతకడం నేర్చుకోక తప్పదు కనుక ప్రజలు అవ్సరామ్ లేకుండా ఇళ్ళలో నుంచి కాలు బయటపెట్టకపోవడమే మంచిది. ఒకవేళ తప్పనిసరిగా బయటకు వెళ్ళవలసివస్తే కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు సూచిస్తున్నట్లుగా అన్ని జాగ్రత్తలు పాటించడం అలవాటుగా చేసుకోవాలి. ప్రస్తుతానికి కళ్ళ ముందు కనిపిస్తున్న ఏకైక పరిష్కార మార్గం.  



Related Post