ఏప్రిల్ 1 నుంచి దేశవ్యాప్తంగా ఎన్‌పీఆర్ షురూ

December 24, 2019


img

ఏప్రిల్ 1 నుంచి సెప్టెంబర్ వరకు దేశవ్యాప్తంగా ఎన్‌పీఆర్ ప్రక్రియను చేపట్టాలని కేంద్రప్రభుత్వం నిర్ణయించింది. దీనికోసం కేంద్రప్రభుత్వం రూ.8,500 కోట్లు కేటాయించింది. 2015లో ఇంటింటి సర్వే ద్వారా సేకరించిన దేశప్రజల వివరాలను జాతీయ పౌర రిజిస్టర్‌ (ఎన్‌పీఆర్)లో నమోదు చేయబడింది. అసోం మినహా అన్ని రాష్ట్రాలు, అన్ని కేంద్రపాలిత ప్రాంతాలలో ఆరు నెలలపాటు మరోసారి సర్వే నిర్వహించి ఎన్‌పీఆర్‌ను నవీనీకరించాలని కేంద్రప్రభుత్వం నిర్ణయించింది. 

ఈ ఎన్‌పీఆర్ సర్వే ద్వారా దేశప్రజలకు సంబందించి పూర్తి వివరాలు అంటే నివాసదృవీకరణ, బయో మెట్రిక్, ఆధార్, పాన్ కార్డులు, డ్రైవింగ్ లైసెన్స్ మొదలైన వివరాలను సేకరిస్తారు. ఈ వివారాలన్నిటినీ డిజిటలైజ్ చేసి భద్రపరుస్తారు.    అయితే ఇప్పటికే పౌరసత్వ సవరణ చట్టాన్ని (సీఏఏ), జాతీయ పౌరజాబితా (ఎన్‌ఆర్సీ)ని వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా ఆందోళనలు సాగుతున్న సమయంలో కేంద్రప్రభుత్వం తీసుకొన్న ఈ తాజా నిర్ణయంతో ఆందోళనలు మరింత ఉదృతమయ్యే అవకాశం ఉంది. భారత్‌లో పుట్టి పెరిగి ఇక్కడే నివాసం ఉంటున్నవారికి దీని వలన ఎటువంటి ఇబ్బందీ ఉండదు. విదేశాల నుంచి అక్రమంగా వలసవచ్చి దేశంలో స్థిరపడినవారిని, తాత్కాలిక వీసాలపై వచ్చి తిరిగి వెళ్లకుండా భారత్‌లో ఉండిపోయినవారిని గుర్తించడానికి ఈ ఎన్‌పీఆర్ సర్వే ఉపకరించవచ్చు. అటువంటివారు కొన్ని రాజకీయ పార్టీలకు ఓటు బ్యాంకులుగా ఉన్నందునే అవి ఈ ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయనుకోవచ్చు. అయితే దేశప్రజలకు సంబందించి సమగ్ర సమాచారం కేంద్రప్రభుత్వం వద్ద ఉన్నట్లయితే అందుకు అనుగుణంగా ప్రణాళికలు, బడ్జెట్‌ను రూపొందించుకోగలదు.


Related Post