కులాల పేరుతో ఓట్లు అడిగితే కేసులు: ఈసీ హెచ్చరిక

November 13, 2018


img

రాష్ట్రంలో రాజకీయ పార్టీలు రాష్ట్ర ఎన్నికల సంఘం మేల్కొనేలోపుగానే ఎన్నికల కోడ్ కు వ్యతిరేకంగా అనేక కార్యక్రమాలు చేసుకుపోతున్నాయి. వాటిలో కాంగ్రెస్‌, తెరాస నేతలు ‘ఆత్మీయ సమావేశాలు’ పేరుతో కులసంఘాల నేతలతో వరుసగా సమావేశాలు నిర్వహిస్తూ వారి మద్దతు కోరుతున్నాయి. కాస్త ఆలస్యంగా ఈ విషయం తెలుసుకొన్న ఎన్నికల సంఘం, కులాల వారీగా ఓట్లు కోరేందుకు కుల సంఘాలతో సమావేశాలు నిర్వహించడాన్ని నిషేదించినట్లు ప్రకటించింది. ఎవరైనా రాజకీయ నాయకులు కుల సంఘాల నేతలతో ఆత్మీయ సమావేశాలు నిర్వహించి ఓట్లు అడిగినట్లయితే వారిపై చట్ట ప్రకారం వారిపై చర్యలు తీసుకొంటామని రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి రజత్ కుమార్ హెచ్చరించారు. ఇప్పటికే కులసంఘాల నేతలతో సమావేశమై వారి మద్దతు కోరిన కొందరు కాంగ్రెస్‌, తెరాస నేతలను సంజాయిషీ కోరుతూ ఎన్నికల సంఘం నోటీసులు పంపిస్తోంది.           



Related Post