నాడు బీఆర్ఎస్‌ ప్రయోగించిన అస్త్రమే నేడు కాంగ్రెస్‌...

November 09, 2025


img

తెలంగాణ శాసనసభ ఎన్నికలలో బీఆర్ఎస్‌ పార్టీ చాలా వ్యూహాత్మకంగా ప్రచారం చేసింది. “ఎన్నికలలో గెలిచిన కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు మా పార్టీలోనే చేరిపోతున్నప్పుడు వాళ్ళకు ఓట్లు వేసి వృధా చేసుకోవడం దేనికి?అదేదో అధికారంలో ఉన్న మా పార్టీకే వేస్తే మేమే మీకు సేవ చేస్తాము కదా?” అని ప్రచారం చేసింది. 

అదేవిదంగా “అధికారంలో లేని కాంగ్రెస్‌, బీజేపిలకు ఓట్లు వేసినా ఏం ప్రయోజనం? ఒకవేళ వాళ్ళను గెలిపించినా అధికారం లేనప్పుడు వారు నియోజకవర్గాలను ఎలా అభివృద్ధి చేయగలరు? ప్రజా సమస్యలు ఎలా పరిష్కరించగలరు?” అని ప్రశ్నించేది. 

ఈ రెండు ప్రశ్నలు ఓటర్లను చాలా ఆలోచింపజేసేవే అని వేరే చెప్పక్కరలేదు. కనుక కాంగ్రెస్‌, బీజేపిలు ఓటర్లకు చాలా నచ్చజెప్పుకోవలసి వచ్చేది. 

ఇప్పుడు జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలో కాంగ్రెస్‌, బీజేపిలు ఇవే ప్రశ్నలు అడుగుతూ, బీఆర్ఎస్‌ పార్టీకి ఓట్లు వేసి ఏం ప్రయోజనం? మీ ఓట్లు వృధా చేసుకోకుండా కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో ఉన్న మా పార్టీలకే ఓట్లు వేయమని ఓటర్లకు విజ్ఞప్తి చేస్తున్నాయి. 


Related Post