సూపర్ స్టార్ కృష్ణ కుటుంబం నుంచి మరో హీరో ఎంట్రీ

November 09, 2025


img

అలనాటి మేటి నటుడు సూపర్ స్టార్ కృష్ణ కుటుంబం నుంచి ఇప్పటికే మహేష్ బాబు టాలీవుడ్‌లో నంబర్: 1గా ఉన్నారు. మహేష్ బాబు కుమార్తె సితారా ఇప్పటికే సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంది. అప్పుడే కొన్ని వాణిజ్య ప్రకటనలలో కూడా నటిస్తోంది. ఏదో రోజూ హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చినా ఆశ్చర్యం లేదు.

మహేష్ బాబు కుమారుడు గౌతమ్‌ కూడా తండ్రిలాగే హీరోలా ఉన్నప్పటికీ ఇంకా సినీ పరిశ్రమలో వస్తాడో లేదో తెలీదు. కానీ వచ్చే అవకాశం ఉంది.  

త్వరలో మహేష్ బాబు మేనకోడలు (మంజుల కుమార్తె) జాన్వీ స్వరూప్ హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వబోతోంది. ఇప్పుడు మహేష్ బాబు సోదరుడు దివంగత రమేష్ బాబు కుమారు జయకృష్ణ కూడా హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. 

వైజయంతీ మూవీస్ అధినేత అశ్వినీ దత్ సమర్పణలో చందమామ కథలు పిక్చర్స్ ఎల్ఎల్‌పీ బ్యానర్‌పై అజయ్ భూపతి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కించబోతున్నారు. ఈ సినిమా నిర్మాత జెమినీ కిరణ్. ఇది తిరుపతి పట్టణంలో ఓ ప్రేమ కధ అంటూ సినిమా కధ క్లుప్తంగా చెపుతూ ఏడుకొండలు చిత్ర పటం పోస్టర్‌గా వేశారు.  

జాన్వీ స్వరూప్, జయకృష్ణల సినిమాలకు సంబంధించి పూర్తి వివరాలు త్వరలోనే ప్రకటించే అవకాశం ఉంది. 


Related Post

సినిమా స‌మీక్ష