నెట్‌ఫ్లిక్స్‌లోకి వస్తోంది... తెలుసు కదా?

November 09, 2025


img

సిద్దు జొన్నలగడ్డ, శ్రీనిధి శెట్టి, రాశీ ఖన్నా ప్రాధాన పాత్రలు చేసిన ‘తెలుసు కదా?’ సినిమా అక్టోబర్ 17న థియేటర్లలో విడుదలై పరవాలేదనిపించుకుంది. ఇప్పుడీ సినిమా నవంబర్‌ 14 నుంచి నెట్‌ఫ్లిక్స్‌ ఓటీటీలో ప్రసారం కాబోతోంది.  

క్లుప్తంగా కధ: హీరో (సిద్ధూ జొన్నలగడ్డ) అనాధ. హీరోయిన్‌ (శ్రీనిధి శెట్టి)తో ప్రేమలో పడతాడు. కానీ ఆమె వద్దనుకొని వెళ్ళిపోతుంది. తర్వాత మరో హీరోయిన్‌ (రాశీ ఖన్నా)ని పెళ్ళి చేసుకుంటాడు. ఇద్దరి మధ్యకి మళ్ళీ మొదటి హీరోయిన్‌గా వస్తుంది. ఎందుకు? తర్వాత ఏం జరిగింది?అనేది సినిమా చూసి తెలుసుకుంటే బాగుంటుంది.              

ఈ సినిమాకి కధ, దర్శకత్వం: నీరజ్ కోనా; సంగీతం: థమన్; కెమెరా: జ్ఞాన శేఖర్, ఎడిటింగ్: నవీన్ నూలి చేశారు. 

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్, కృతి ప్రసాద్ కలిసి తెలుగు, తమిళ్, కన్నడ భాషల్లో ఈ సినిమా నిర్మించారు. 



Related Post

సినిమా స‌మీక్ష