గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌ మిస్ అవ్వొద్దు: మహేష్ బాబు

November 09, 2025


img

రాజమౌళి-మహేష్ బాబు కాంబినేషన్‌లో ఎస్ఎస్ఎంబీ29 వర్కింగ్ టైటిల్‌తో తీస్తున్న సినిమాని ఇప్పుడు ‘గ్లోబ్ ట్రోటర్’ అంటూ ప్రచారం చేస్తున్నారు. ఈ పేరుతోనే ఈ నెల 15 సాయంత్రం 6 గంటల నుంచి రామోజీ ఫిల్మ్ ఛాంబర్‌ సిటీలో ఓ భారీ ఈవెంట్‌ నిర్వహించబోతున్నారు రాజమౌళి. 

మహేష్ బాబు స్వయంగా ఈ విషయం తెలియజేస్తున్న ఓ వీడియోని స్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ సినిమాలో పృధ్వీరాజ్ సుకుమారన్, మాధవన్, ప్రియాంకా చోప్రా తదితరులు ముఖ్యపాత్రలు చేస్తున్నారు. దుర్గా ఆర్ట్స్ పతాకంపై కేఎల్ నారాయణ నిర్మిస్తున్న ఈ సినిమాకి ‘వారణాసి’ అనే పేరు ఖరారు చేసినట్లు సమాచారం. 


Related Post

సినిమా స‌మీక్ష