ప్రియదర్శి ప్రేమంటే... పెళ్ళి షురూ లిరికల్!

November 08, 2025


img

శ్రీరామ్‌ దర్శకత్వంలో ప్రియదర్శి, అనంది సుమ జంటగా చేస్తున్న ‘ప్రేమంటే’ సినిమా నుంచి నేడు ‘పెళ్ళి షురూ...’ అనే లిరికల్ వీడియో సాంగ్‌ విడుదలయ్యింది. 

శ్రీమాన్ వ్రాసిన ఈ పాటకి లియాన్ జేమ్స్ సంగీతం అందించగా శ్రేయా గోషల్, దీపక్ బ్లూ కలిసి పాడారు.   

ఈ సినిమాలో యాంకర్ సుమ తొలిసారిగా పోలీసుగా నటిస్తున్నారు. వెన్నెల కిషోర్‌ ఆమె బాస్‌. కనుక కామెడీకి కరువు ఉండదు. 

ఈ సినిమాకి కధ, దర్శకత్వం: నవనీత్ శ్రీరామ్‌, సంగీతం: లియాన్ జేమ్స్, కెమెరా: విశ్వనాథ్ రెడ్డి, ఎడిటింగ్: రవిచంద్ర తిరున్, ఆర్ట్: అరవింద్ ములే చేస్తున్నారు.  

స్పిరిట్ మీడియా బ్యానర్‌పై రానా దగ్గుబాటి సమర్పణలో పుస్కుర్ రామ్ మోహన్ రావు, జాన్వీ నారంగ్‌ కలిసి ఈ సినిమా నిర్మిస్తున్న ఈ సినిమా ఈ నెల 21న విడుదల కాబోతోంది. 

<iframe width="560" height="315" src="https://www.youtube.com/embed/rEIc0JGjfvw?si=oDR_2IOecxWHBtsC" title="YouTube video player" frameborder="0" allow="accelerometer; autoplay; clipboard-write; encrypted-media; gyroscope; picture-in-picture; web-share" referrerpolicy="strict-origin-when-cross-origin" allowfullscreen></iframe>

Related Post

సినిమా స‌మీక్ష