మళ్ళీ చాలా నెలల తర్వాత నాగర్‌కర్నూల్ నుంచి శ్రీశైలంకి లాంచ్ సర్వీసు పునః ప్రారంభమైంది. జిల్లా పర్యాటక, పోలీస్ శాఖ అధికారులు శనివారం ఉదయం జిల్లాలోని కొల్లాపూర్ మండలం సోమశిల వద్ద వీఐపీ పుష్కర్ ఘాట్ వద్ద పూజ చేసి లాంచ్ సర్వీసు ప్రారంభించారు. చుట్టూ దట్టమైన నల్లమల అడవులు ఎత్తయిన కొండలను చూస్తూ కృష్ణ నదిలో లాంచి ప్రయాణం మాటలతో వర్ణించలేని ఓ గొప్ప అనుభూతినిస్తుంది.
నాగర్‌కర్నూల్ చుట్టుపక్కల జిల్లాలు, హైదరాబాద్ నుంచి వచ్చిన పర్యాటకులు ఆ లాంచీలో ఎక్కి ప్రకృతి అందాలు వీక్షిస్తూ శ్రీశైలం చేరుకున్నారు. ఇక నుంచి ప్రతీ రోజూ లాంచీ సర్వీసు నడిపిస్తామని పర్యాటక శాఖ అధికారులు చెప్పారు. కనుక ప్రజలు ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. పూర్తి వివరాల కోసం తెలంగాణా పర్యాటకశాఖ అధికార వెబ్ సైట్ చూడవచ్చు .