పశ్చిమ ఆఫ్రికా దేశం ‘మాలి’లో ఐదుగురు భారతీయ కార్మికులు కిడ్నాప్ అయ్యారు. ఓ స్థానిక సంస్థ విద్యుదీకరణ ప్రాజెక్టులో వారు పని చేస్తున్నారు. గత దశాబ్దకాలంగా మాలిలో ఉగ్రవాద సంస్థలు విదేశీయులను కిడ్నాప్ చేసి డబ్బు దండుకుంటున్నాయి. అటువంటి ఉగ్రవాద సంస్థే భారతీయ కార్మికులను కిడ్నాప్ చేసిందని వారు పనిచేస్తున్న సంస్థ తెలిపింది. ముందు జాగ్రత్త చర్యగా మిగిలిన కార్మికులందరినీ తక్షణం రాఃధాని ‘బమాకో’కు తరలించామని ఆ సంస్థ ప్రతినిధులు తెలిపారు.
కానీ ఉగ్రవాద సంస్థలు అడిగినంత డబ్బు చెల్లిస్తేనే వారిని విడుదల చేస్తుంటాయి. ఇటీవల 50 మిలియన్ డాలర్లు తీసుకొని గల్ఫ్ దేశాలకు చెందిన ముగ్గురిని ఉగ్రవాద సంస్థలు విడుదల చేశాయి. వారు బయటకు రాగానే ఇప్పుడు మరో సంస్థ ఐదుగురు భారతీయ కార్మికులను కిడ్నాప్ చేసింది.
కిడ్నాప్ అయిన ఐదుగురు భారతీయ కార్మికులను విడిపించేందుకు భారత్ విదేశాంగ అధికారులు మాలి ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నారు.