150 ఏళ్ళ క్రితం వ్రాసిన వందే మాతరం నేటికీ...

November 07, 2025


img

150 ఏళ్ళ క్రితం అంటే 1875, నవంబర్‌ 7వ తేదీన ప్రముఖ బెంగాలీ కవి బంకించంద్ర ఛటర్జీ భారత జాతీయ గేయం ‘వందే మాతరం’ రచించారు. ఈ గేయం నాడు స్వాతంత్ర పోరాటాలు చేస్తున్న ప్రతీ ఒక్కరినీ ఎంతగానో ఉత్తేజపరిచింది.

150 ఏళ్ళ తర్వాత కూడా నేటికీ కాశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకు, గుజరాత్ నుంచి అరుణాచల్ ప్రదేశ్ వరకు వందే మాతరం గేయం వినపడుతూనే ఉంటుంది. ఈ గేయం విన్న ప్రతీ ఒక్కరికీ దేశభక్తితో ఒళ్ళు పులకిస్తుంటుంది. భారతీయులలో భిన్నత్వంలో ఏకత్వానికి నిదర్శనంగా నిలుస్తూ అందరిలో దేశభక్తి రగిలిస్తూనే ఉంటుంది. 

వందే మాతరం గేయం రచించి 150 సంవత్సరాలు పూర్తయినందున దేశ వ్యాప్తంగా ఘనంగా వేడుకలు జరుగుతున్నాయి. ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ముఖ్యమంత్రులు, గవర్నర్లు, అధికార, ప్రతిపక్ష నేతలు ఈ కార్యక్రమాలలో పాల్గొన్నారు.


Related Post