అమెరికాలో కార్గో విమానం ఘోర ప్రమాదం

November 05, 2025
img

అమెరికాలో కెంటకీ రాష్ట్రంలో లూయిస్ విల్లేలో ఓ భారీ కార్గో విమానం మహ్మద్ అలీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి టేకాఫ్ అవుతుండగా మంటలు అంటుకొని కూలిపోయింది. విమానంలో భారీగా ఇంధనం నిలువ ఉండటంతో మంటలు వ్యాపించి భారీ శబ్దంతో పేలి పోయింది. ఈ ప్రమాదంలో విమాన పైలట్లతో సహా ముగ్గురు మరణించారు. మరో 11 మంది తీవ్రంగా గాయపడ్డారు.  

అమెరికా కాలమాన ప్రకారం బుధవారం సాయంత్రం 5.15 గంటలకు యూపీఎస్ ఫ్లైట్ నం:2976  మహ్మద్ అలీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి నుంచి హవాయి రాష్ట్రంలోని హోనులులుకి బయలుదేరింది. టేకాఫ్ అయిన కొద్ది సేపటికే కూలి పేలిపోయింది. 

ప్రమాదానికి కారణం ఇంకా తెలియాల్సి ఉంది. అగ్నిమాపక, సహాయ బృందాలు మంటలు ఆర్పివేసి విమాన శిధిలాలను తొలగిస్తున్నారు. వాటిలో చిక్కుకున్న మృతదేహాలను వెలికి తీస్తున్నారు. 

<blockquote class="twitter-tweet" data-media-max-width="560"><p lang="en" dir="ltr">New footage about UPS cargo plane crash near Louisville, Kentucky airport showing the fire during take-off. <a href="https://t.co/p93xAw6qa4">pic.twitter.com/p93xAw6qa4</a></p>&mdash; aircraftmaintenancengineer (@airmainengineer) <a href="https://twitter.com/airmainengineer/status/1985844726256328726?ref_src=twsrc%5Etfw">November 4, 2025</a></blockquote> <script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script>

Related Post