హిందూజా గ్రూప్ చైర్మన్ గోపీచంద్ పి హిందూజా (జీపీ) (85) ఇక లేరు. లండన్‌లో నివాసం ఉంటున్న ఆయన గత కొంతకాలంగా వృద్ధాప్య సంబంధిత అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆస్పత్రిలోనే మంగళవారం తుదిశ్వాస విడిచారు.
హిందూజా వంశంలో నలుగురు అన్నదమ్ములలో జీపీ రెండో వారు. తన సోదరుడు శ్రీ చంద్ హిందూజా మరణాంతరం 83 ఏళ్ళ వయసులో 2025లో హిందూజా గ్రూప్ పగ్గాలు చేపట్టారు. కానీ గ్రూప్ పగ్గాలు చేపట్టిన రెండేళ్ళకే కన్ను మూశారు. జీపీకి భార్య సునీత, కుమారులు సంజయ్, ధీరజ్, ఓ కుమార్తె రీటా ఉన్నారు.
కానీ జీపీ 1950 నుంచే హిందూజా గ్రూపులో చేరి అనేక హోదాలలో పనిచేశారు. జీపీ కృషి, పట్టుదల, తెలివి తేటలతోనే హిందూజా గ్రూప్ మరిన్ని రంగాలలోకి ప్రవేశించింది. ముఖ్యంగా గల్ఫ్ దేశాలలో హిందూజా గ్రూప్ వ్యాపారాలను విస్తరించారు. జీపీ తర్వాత ఆయన సోదరుడు ప్రకాష్ హిందూజా గూప్ చైర్మన్‌గా పగ్గాలు చేపట్టే అవకాశం ఉంది.
జీపీ మృతి పట్ల ప్రధాని మోడీతో సహా పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.