రాజూ వెడ్స్ రాంభాయ్ నుంచి మరో మంచి పాట

November 04, 2025


img

డైరెక్టర్ వేణు ఉడుగుల ‘నీది నాదీ ఒకే కథ’, ‘విరాట పర్వం’ సినిమాలతో తనకంటూ మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఇప్పుడు ఆయన నిర్మాతగా మారి సొంత ప్రొడక్షన్ హౌస్‌లో తెలంగాణ గ్రామీణ నేపధ్యంలో చక్కటి ప్రేమ కధ ‘రాజు వెడ్స్ రాంబాయి’ తీశారు.  ఇది వరంగల్-ఖమ్మం సరిహద్దు గ్రామాల్లో జరిగిన నిజమైన ప్రేమ కధ.సాయిలు కంపాటి దర్శకత్వంలో అఖిల్, తేజస్వి రావ్ జంటగా నటించారు. శివాజీ రాజ, చైతు జొన్నలగడ్డ, అనిత చౌదరి, కవిత శ్రీరంగం ముఖ్యపాత్రలు చేశారు. 

ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన రెండు పాటలు చాలా వైరల్ అయ్యాయి. తాజాగా నేడు మరో పాట విడుదల చేశారు. ‘నీ మీద నాకు...’ అంటూ సాగే ఈ ప్రేమ గీతాన్ని మిట్టపల్లి సుందర్ వ్రాయగా, సురేష్ బొబ్బిలి సంగీతం అందించారు. అనురాగ్ కులకర్ణి, జయశ్రీ పళ్ళెం కలిసి చాలా శ్రావ్యంగా ఆలపించారు.  

ఈ సినిమాకి కధ, దర్శకత్వం: సాయిలు కాంపాటి, సంగీతం: సురేష్ బొబ్బిలి, కెమెరా: వజీద్ బేగ్, ఎడిటింగ్:నరేష్ అడుప , ఆర్ట్: గాంధి నడికుడికర్, స్టంట్స్: స్టంట్స్ శేఖర్ చేశారు. 

దోలముఖి సబాల్టర్న్ ఫిల్మ్స్, మాన్సూన్స్ టేల్స్ బ్యానర్లపై రాహుల్ మోపిదేవి నిర్మించిన ఈ సినిమాలో ప్రముఖ తెలుగు ఓటీటీ సంస్థ ఈటీవీ విన్‌ కూడా ప్రధాన భాగస్వామిగా ఉంది. నవంబర్‌ 21న ఈ సినిమా విడుదల కాబోతోంది.


Related Post

సినిమా స‌మీక్ష