హైదరాబాద్‌ మెట్రో ప్రభుత్వం చేతికి... కష్టమే!

September 26, 2025
img

హైదరాబాద్‌ మెట్రో నుంచి ఎల్&టి సంస్థ పూర్తిగా తప్పుకుంది. అదిప్పుడు పూర్తిగా తెలంగాణ ప్రభుత్వం చేతికి వచ్చింది. 

హైదరాబాద్‌ మెట్రో మొదటి దశకు చేసిన అప్పులు పెరిగిపోయి నష్టాలలో కూరుకుపోవడంతో ఎల్&టి సంస్థ దానిని ప్రభుత్వానికి అప్పగించి బయటపడుతోంది. తెలంగాణ ప్రభుత్వం ఎల్&టి సంస్థ బకాయిలకు గాను రూ.13,000 దాని ఈక్విటీ బకాయిలు మరో రూ.2,000 కోట్లు చెల్లింఛడానికి అంగీకరిస్తూ ఒప్పందం చేసుకుంది. ఇంతకాలం ఎల్&టి సంస్థ హైదరాబాద్‌ మెట్రో నిర్మాణం, నిర్వహణ చూసుకునేది. 

మెట్రో విస్తరణకు తప్పనిసరిగా ఏదో ఓ సంస్థ పూర్తి బాధ్యత తీసుకుంటేనే కేంద్ర ప్రభుత్వం అనుమతి మంజూరు చేస్తుంది. కనుక ప్రభుత్వంతో భాగస్వామిగా ఉండాలని కోరినా ఆ సంస్థ అంగీకరించలేదు. కనుక తెలంగాణ ప్రభుత్వమే హైదరాబాద్‌ మెట్రోని స్వాధీనం చేసుకుంది. కనుక ఇప్పుడు మెట్రో విస్తరణకు కేంద్ర ప్రభుత్వం అనుమతిస్తుంది. 

ఈ ప్రాజెక్టు నుంచి పూర్తిగా బయటపడాలనుకుంటున్న ఎల్&టి సంస్థ ఒకవేళ తాత్కాలికంగా కొన్ని నెలలు మెట్రో సర్వీసులను నడిపించేందుకు అంగీకరించినా ఆ తర్వాత? హైదరాబాద్‌ మెట్రో సర్వీసులని అప్పుడు ఎవరు నిర్వహిస్తారు? ప్రభుత్వమా? వేరే ప్రైవేట్ కంపెనీయా?

Related Post