చర్లపల్లి రైల్వే స్టేషన్‌కి రోజుకి 200 బస్సులు... ఇవిగో జాబితా!

September 13, 2025
img

హైదరాబాద్‌కి చాలా దూరంగా చర్లపల్లి రైల్వే స్టేషన్‌ చాలా అద్భుతంగా నిర్మించారు. కానీ అక్కడికి చేరుకోవాలన్నా, అక్కడి నుంచి నగరంలో వివిధ ప్రాంతాలకు చేరుకోవాలన్నా ప్రయాణికులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. వారి సౌలభ్యం కోసం టీజీఎస్ ఆర్టీసీ ఒకటీ రెండూ కాదు రోజుకి ఏకంగా 200 బస్సులు నడుపుతోందని అధికారులు తెలిపారు. ఇవి కాక  పండగ స్పెషల్ రైళ్ళు నడుస్తుంటే వాటికి తగినట్లుగా అదనపు బస్సులను కూడా నడిపిస్తున్నామని తెలిపారు. టీజీఎస్ ఆర్టీసీ ‘గమ్యం’ మొబైల్ యాప్‌లో చర్లపల్లి రైల్వే స్టేషన్‌కి రాకపోకలు సాగించే సిటీ బస్సుల వివరాలు, వాటి సమయాలు అన్నీ చూడవచ్చని అధికారులు తెలిపారు. 

వాటిలో కొన్ని బస్సుల వివరాలు: 

బస్ నంబర్: 250: చర్లపల్లి (1వ నంబర్ ప్లాట్‌ఫారం వైపు) చర్లపల్లి-సికింద్రాబాద్‌ స్టేషన్  వయా హెచ్‌సీఎల్ క్రాస్ రోడ్స్, మల్లాపూర్, హబ్సీగూడ.  

బస్ నంబర్:250/49ఎం: చర్లపల్లి-మొహిదీపట్నం వయా ఈసీఐఎల్, మల్లాపూర్, హబ్సీగూడ.   

బస్ నంబర్: 16హెచ్/49ఎం: చర్లపల్లి-మొహిదీపట్నం వయా ఈసీఐఎల్,బస్టాండ్, హెచ్‌బీ కాలనీ, మల్కాజిగిరి. సికింద్రాబాద్‌, బంజారాహిల్స్‌, మొహిదీపట్నం.    

బస్ నంబర్: 113ఎఫ్/జెడ్: చర్లపల్లి-బోరబండ వయా చెంగిచర్ల, ఉప్పల్, రామంతాపూర్, నారాయణగూడ, పంజాగుట్ట, ఎర్రగడ్డ, బొరబండ.  

బస్ నంబర్: 71ఏ: చర్లపల్లి-అఫ్జల్ గంజ్ వయా చెంగిచర్ల, మేడిపల్లి, ఉప్పల్, రామంతాపూర్, చాదర్ ఘాట్.  

బస్ నంబర్: 219/250సి: చర్లపల్లి-పటాన్‌చెరు వయా హెచ్‌సీఎల్ క్రాస్ రోడ్స్, నామా, మల్లాపూర్, హబ్సీగూడ, తార్నాక, బాలానగర్, పటాన్‌చెరు.     


Related Post