హై స్కూల్ అంటే ఎవరికీ అనుమానం రాధనుకున్నారో ఏమో బోయినపల్లిలో మేధా హై స్కూల్లో యాజమాన్యం రహస్యంగా మాదక ద్రవ్యాలు తయారుచేసి నగరంలో పలు ప్రాంతాలకు పంపిణీ చేస్తోంది. కానీ మాదకద్రవ్యాల నిరోధం కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈగల్ టీమ్ వాసన పసిగట్టేసి మేధా స్కూలుపై వాలిపోయింది.
స్కూలు ఆఫీస్ రూముతో పాటు పక్కనే ఉన్న మరికొన్ని గదులలో మాదక ద్రవ్యాలు తయారీకి వినియోగించే నిషేదిత ఆల్ఫాజాలం అనే రసాయనం (7 కేజీలు) మరికొన్ని ఇతర రసాయనాలు, డ్రగ్స్ తయారీకోసం వినియోగించే పరికరాలు, తయారైన డ్రగ్స్ ప్యాకింగ్ చేసేందుకు సిద్దంగా ఉంచిన కవర్లు, రూ.20 లక్షల నగదుని ఈగల్ టీమ్ స్వాధీనం చేసుకుంది. మేధా హైస్కూలు యాజమాన్యంపై కేసు నమోదు చేసి స్కూలుని సీజ్ చేశారు.