మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ సభ్యురాలు పోతుల కల్పన అలియాస్ సుజాతక్క నేడు తెలంగాణ పోలీసులకు లొంగిపోయారు. ఆమె 106 కేసులలో నిందితురాలిగా ఉన్నారు. ప్రస్తుతం ఆమె ఛత్తీస్ ఘడ్ సౌత్ సబ్ జోనల్ బ్యూరో ఇన్‌ఛార్జ్‌గా వ్యవహరిస్తున్న ఆమెను పట్టుకున్నవారికి కేంద్ర ప్రభుత్వం కోటి రూపాయలు బహుమానం ప్రకటించింది.
డీజీపీ జితేందర్ ఆమె పోలీసులకు లొంగిపోయారని తెలిపారు. ఆమె స్వస్థలం గద్వాల జిల్లాలోని గట్టు మండలం పెంచికలపాడు. తొలుత ఆమె జన నాట్య మండలిలో ఆ తర్వాత ఆర్‌ఎస్‌యూలో పనిచేశారు, 1996 నుంచి మావోయిస్ట్ కమాండర్‌గా పనిచేస్తున్నారు. రాష్ట్ర కేంద్ర కమిటీలో ఆమె సభ్యురాలుగా వ్యవహరించారు.
ఆమె అనారోగ్య కారణాలతో మావోయిస్టులతో బంధం తెంచుకొని జనజీవన స్రవంతిలో కలిసిపోవాలని నిర్ణయించుకొని లొంగిపోయారు. మావోయిస్టులను విడిచి పెట్టినందుకు ఆమెకు ప్రభుత్వం తరపున రూ.25లక్షలు నగదు బహుమతి ఇస్తామని డీజీపీ జితేందర్ ప్రకటించారు. మిగిలిన మావోయిస్టులు కూడా ఆయుధాలు విడిచిపెట్టి జన జీవన స్రవంతిలో కలవాలని డీజీపీ జితేందర్ విజ్ఞప్తి చేశారు.