ఓజీ... ఇది విన్నారా?

September 13, 2025


img

సుజీత్ దర్శకత్వంలో పవన్‌ కళ్యాణ్‌, ప్రియాంక మోహన్ జంటగా చేసిన భారీ యాక్షన్ మూవీ ‘ఓజీ’ ఈ నెల 25న విడుదల కాబోతోంది. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో దర్శక నిర్మాతలు వరుసగా సినీ ప్రమోషన్స్‌కి ముహూర్తం పెట్టేశారు. తాజా సమాచారం ప్రకారం ఈ నెల 15 (సోమవారం) గన్స్ అండ్ రోజాస్ పాట విడుదల కాబోతోంది. ఆ తర్వాత సెప్టెంబర్‌ 18న ట్రైలర్‌, 20న ప్రీ రిలీజ్ ఈవెంట్‌ నిర్వహించబోతున్నారు. ఈ నెల 19 నుంచి ఏపీ, తెలంగాణ రాష్ట్రాలతో సహా దేశవ్యాప్తంగా ఓజీ అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభం అవుతాయి.       

ఓజీ పవన్‌ కళ్యాణ్‌కి విలన్‌గా బాలీవుడ్‌ నటుడు ఇమ్రాన్ హష్మీ నటించారు. ఈ సినిమాలో శుభలేఖ సుధాకర్, ప్రకాష్ రాజ్, అజయ్ ఘోష్, అర్జున్ దాస్, శ్రీయ రెడ్డి, హరీష్ శంకర్‌ ఉత్తమన్, అభిమన్యు సింగ్‌ తదితరులు ముఖ్యపాత్రలు చేశారు.

ఈ సినిమాకి కధ, దర్శకత్వం: సుజీత్, సంగీతం: థమన్; కెమెరా: రవి కె చంద్రన్; ఎడిటింగ్: నవీన్ నూలి చేశారు. 

డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌పై డీవీవీ దానయ్య సుమారు రూ.300 కోట్ల భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా మూవీగా నిర్మించిన ఓజీ  సెప్టెంబర్‌ 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది.



Related Post

సినిమా స‌మీక్ష