గుడ్ బై సోషల్ మీడియా: స్వీటీ అనుష్క

September 12, 2025


img

క్రిష్ దర్శకత్వంలో అనుష్క ప్రధాన పాత్రలో వచ్చిన ‘ఘాటి’ సినిమాపై చాలా భారీ అంచనాలు ఉండగా వాటిని అందుకోవడంలో విఫలమైంది. అనుష్క కూడా నిరాశ చెందడం సహజమే. కానీ ఆమె ఎవరూ ఊహించని విదంగా కొంతకాలం సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు.

ఇదే విషయం తెలియజేస్తూ “సోషల్ మీడియా నుంచి కొంతకాలం దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాను. జీవితం, కెరీర్‌ రెండింటిపై లోతుగా ఆలోన్చుకొని మళ్ళీ ఈ సోషల్ మీడియా ప్రపంచంతో రీ కనెక్ట్ అవుతాను. అంతవరకు చిరునవ్వుతో ఎదురుచూడండి,” అని ఎక్స్‌ సోషల్ మీడియాలో ఓ మెసేజ్ పెట్టారు. 

అనుష్క అత్యద్భుతమైన నటి అని ఘాటి సినిమాతో మరోసారి నిరూపించుకున్నారు. కానీ సరైన కధ ఎంచుకోలేకపోవడం పోటీలో వెనుకబడిపోతున్నారు. కనుక కాస్త గ్యాప్ తీసుకొని తన జీవితం, కెరీర్‌ గురించి ఆలోచించుకోవడం మంచిదే.   

 


Related Post

సినిమా స‌మీక్ష