త్వరలో జాంబిరెడ్డి-2... మళ్ళీ వాళ్ళిద్దరే

September 12, 2025


img

ప్రశాంత్ వర్మ, తేజా సజ్జా ఇద్దరూ కలిసి జాంబిరెడ్డితో కెరీర్‌ మొదలుపెట్టి హనుమాన్‌తో హిట్ కొట్టారు. ఆ తర్వాత ఇద్దరూ వేర్వేరు సినిమాలు చేస్తున్నారు. తేజా సజ్జా తాజా చిత్రం మిరాయ్ పాన్ ఇండియా మూవీగా విడుదల చేస్తే అది సూపర్ హిట్ అయ్యింది.

ఇక ప్రశాంత్ వర్మ రిషబ్ శెట్టితో జై హనుమాన్ పూర్తి చేస్తున్నారు. అది చేస్తుండగానే పూజ కొల్లూరు దర్శకత్వంలో ఆర్‌కే దుగ్గల్ సమర్పణలో ‘మహాకాళి’ అనే మరో సినిమా మొదలుపెడుతున్నారు.

జైహనుమాన్ పూర్తికాగానే మళ్ళీ తేజా సజ్జాతో కలిసి జాంబిరెడ్డికి సీక్వెల్‌గా జాంబిరెడ్డి-2 తీయబోతున్నారు.

ఇప్పటికే వీరిది హిట్ కాంబినేషన్‌ అని నిరూపించుకున్నారు కనుక ఈ సినిమా ప్రకటనతోనే దీనిపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. పైగా ఇద్దరూ మంచి సినీ అనుభవం కూడా సంపాదించుకున్నారు

కనుక జాంబిరెడ్డి సీక్వెల్‌ అంతర్జాతీయ స్థాయిలో ఉంటుంది... అని ప్రశాంత్ వర్మ స్వయంగా చెప్పారు. ఇంతకాలం హాలీవుడ్, చైనా జాంబియాలను మనకు చూపారు. ఇప్పుడు మన జాంబియాలు ఎలా ఉంటాయో లోకానికి చూపిద్దామన్నారు ప్రశాంత్ వర్మ!  


Related Post

సినిమా స‌మీక్ష