మలయాళ భామ అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్ర చేసిన ‘పరదా’ ఆగస్ట్ 22న థియేటర్లలో విడుదలైంది. సినిమా టాక్ బాగానే ఉన్నప్పటికీ బాక్సాఫీసు వద్ద నిరాశ పరిచింది. కనుక మూడు వారాలు కూడా పూర్తికాక ముందే ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలోకి వచ్చేసింది. నేటి నుంచే అమెజాన్ ప్రైమ్ వీడియోలో తెలుగు, మళయాళ భాషల్లో ప్రసారం కాబోతోంది.
ఈ సినిమా ప్రీ-రిలీజ్ ప్రెస్‌మీట్‌లో అనుపమ మాట్లాడుతూ, “ఓటీటీ సంస్థలు మా సినిమా తీసుకోవడానికి ముందుకు వస్తున్నాయంటే అర్ధం సినిమా బాగుంటుందనే నమ్మకంతోనే కదా? కనుక మా పరదాని ఓటీటీ బుక్ చేసుకోవడం శుభ పరిణామంగానే చూస్తాను,” అని అన్నారు.
కానీ ఆమె చెప్పినట్లుగానే థియేటర్లలో నిలదొక్కుకోలేకపోయిన పరదాని అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలలోకి తీసుకొని కాపాడింది.
ఈ సినిమాకు సంగీతం: గోపీ సుందర్, కెమెరా: మృధుల్ సుజీత్ సేన్, ఆర్ట్: శ్రీనివాస్ కాళింగ, ఎడిటింగ్: ధర్మేంద్ర కాకర్ల చేశారు. ఆనంద్ మీడియా బ్యానర్‌పై విజయ్ డొంకాడ, శ్రీనివాసులు పీవీ, శ్రీధర్ మక్కువ కలిసి ఈ సినిమా నిర్మించారు.