మిరాయ్: మంచు మనోజ్‌కి ఈ విజయం చాలా అవసరమే

September 13, 2025


img

టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ని సొంతం చేసుకున్న నటుడు మంచు మనోజ్‌. కానీ వరుస పరాజయాలు, వ్యక్తిగత జీవితంలో ఎదురైన ఒడిదుడుకులు ఆయన జీవితాన్ని, సినీ కెరీర్‌ని కూడా బాగా దెబ్బతీశాయి. ఫలితంగా అనేక ఏళ్ళపాటు ఇండస్ట్రీకి దూరమైపోయారు.

మంచు మనోజ్ కెరీర్‌లో ఇక ముగిసినట్లే అనుకుంటున్న సమయంలో ‘మిరాయ్’ సినిమా గట్టెక్కించింది.

చిన్న హీరో... చిన్న సినిమాలో విలనా....? అని బేషజానికి పోకుండా మిరాయ్ చేసినందుకు గొప్ప ప్రతిఫలమే లభించింది. మిరాయ్ సినిమాలో మంచు మనోజ్ నటనకు, ముఖ్యంగా అతను చూపిన విలనిజంకు ప్రేక్షకులు ముగ్దులయ్యారు. ఈ సినిమాకి సంబందించినంత వరకు హీరో తేజా సజ్జాతో సమానంగా  మంచు మనోజ్‌కి గౌరవ మర్యాదలు, గుర్తింపు లభిస్తున్నాయి. 

జీవితంలో, సినీ కెరీర్‌లో అనేక ఒడిదుడుకులు ఎదుర్కొన్న మంచు మనోజ్‌కి ఇటువంటి గొప్ప విజయం చాలా అవసరమే.

తన జీవితంలో మరిచిపోలేని ఇంత గొప్ప విజయాన్ని, ఆనందాన్ని అందించినందుకు మంచు మనోజ్‌ మిరాయ్ సక్సస్ మీట్‌లో తేజా సజ్జాని కౌగలించుకొని ఎత్తుకొని తిప్పారు.

ఆ తర్వాత ఎవరూ ఊహించని విధంగా వయసులో తన కంటే చిన్నవాడైన మిరాయ్ సంగీత దర్శకుడు గౌరహరి పాదాలకు నమస్కారం చేశారు.

మంచు మనోజ్‌ ఈ విజయాన్ని ఎంత గొప్పదిగా భావిస్తున్నారో అర్ధం చేసుకునేందుకు ఇంతకంటే గొప్ప నిదర్శనం ఏముంటుంది?  మిరాయ్ సూపర్ హిట్ అవడంతో మంచు మనోజ్‌కి ఇక వెనుతిరిగి చూసుకోనవసరం ఉండకపోవచ్చు.


Related Post

సినిమా స‌మీక్ష