వినియోగదారులకు షాక్‌ ఇచ్చిన జియో, ఎయిర్ టెల్

August 20, 2025
img

రిలయన్స్ జియో, ఎయిర్ టెల్ సంస్థలు తం వినియోగదారులకు షాక్ ఇచ్చాయి. రెండూ కూడా బేసిక్ నెల ప్లాన్స్ రద్దు చేశాయి. ముందుగా రిలయన్స్ జియో సంస్థ 28 రోజుల బేసిక్ ప్లాన్‌లో రోజుకి 1 జీబీ డేటా అందించేది. దానిని నిలిపివేసి రూ.299ల ప్లాన్‌లో రోజుకి 1.5 జీబీ చొప్పున అందిస్తోంది. 

జియో బేసిక్ ప్లాన్ రద్దు చేయగానే ఎయిర్ టెల్ కూడా రద్దు చేసింది. ఇంతవరకు 24 రోజుల బేసిక్ ప్లాన్‌లో రోజుకి 1 జీబీ డేటా ఇస్తుండేది. దానిని రద్దు చేసి బేసిక్ ప్లాన్ రూ.319కి పెంచింది. అయితే 24 రోజులకు బదులు ఇప్పుడు పూర్తి నెల రోజులకు పెంచింది. 

జియో, ఎయిర్ టెల్ రెండు సంస్థలు బేసిక్ ప్లాన్ రద్దు చేసి అధిక ధరకు అప్‌గ్రేడ్‌ చేశాయి కనుక వోడాఫోన్-ఐడియా రూ.299ల బేసిక్ ప్లాన్ (రోజుకి 1 జీబీ)ని రద్దు చేసే అవకాశం ఉంది.

బేసిక్ ప్లాన్ రద్దు చేసి రోజుకి 1.5జీబీ ప్లాన్ వాడుకోక తప్పనిసరి పరిస్థితి కల్పించినందున వినియోగదారులకు రోజుకి 1.5జీబీ డేటా అవసరం ఉన్నా లేకపోయినా ఈ ప్లాన్ తీసుకొని ఇందుకు డబ్బులు చెల్లించక తప్పదు. కనుక టెలికాం సంస్థలకు దీంతో గణనీయంగా ఆదాయం పెరుగుతుంది. 

Related Post