రాఖీ స్పెషల్ బస్సులలో 50 శాతం అదనపు బాదుడు!

August 09, 2025
img

నేడు రాఖీ పండుగ సందర్భంగా హైదరాబాద్‌తో సహా రాష్ట్రంలో అన్ని జిల్లాల నుంచి పెద్ద ఎత్తున మహిళలు ఆర్టీసీ బస్సులలో తమ సొంత  ఊర్లకు బయలుదేరారు. వారిలో చాలామంది ఆంధ్రాలో తమ ఊళ్ళకు బయలుదేరారు. ఏపీలో సొంత ఊళ్ళలో ఉంటున్న తమ సోదరులకు రాఖీలు కట్టిన తర్వాత తిరుగు ప్రయాణం అవుతారు. 

కనుక వారి కోసం టీజీఎస్ ఆర్టీసీ ప్రత్యేక బస్సులు వేసింది. ఆ బస్సులలో నేటి నుంచి ఈ నెల 11  వరకు 50 శాతం అదనపు ఛార్జీ వసూలు చేస్తున్నట్లు టీజీఎస్ ఆర్టీసీ ప్రకటించింది. మహిళలను ఊళ్ళలో దింపిన తర్వాత బస్సులు ఖాళీగా వెనక్కు తిరిగి వస్తున్నందున, ఆర్టీసీకి చాలా నష్టం వస్తోందని అధికారులు తెలిపారు. కనుక ఈ రెండు రోజులు ఆ బస్సులలో మాత్రమే టికెట్ ఛార్జీలపై అదనంగా 50 శాతం ఛార్జీ వసూలు చేస్తున్నామని తెలిపారు. 

ఈ నెల 11 తర్వాత వాటిలో మళ్ళీ పాత ఛార్జీలే ఉంటాయని చెప్పారు. కనుక టికెట్ ఛార్జీలు భారీగా పెంచేసినట్లు వస్తున్న పుకార్లను నమ్మవద్దని టీజీఎస్ ఆర్టీసీ విజ్ఞప్తి చేశారు.

Related Post