సికింద్రాబాద్‌-వాడి రైల్వేలైన్లు విస్తరణకు గ్రీన్ సిగ్నల్‌

August 29, 2025
img

సికింద్రాబాద్‌-వాడి రైల్వే స్టేషన్ల మద్య ప్రస్తుతం ఉన్న రెండు రైల్వేలైన్లను నాలుగు లైన్లకు విస్తరించేందుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది.

రూ.5,102 కోట్లు వ్యయంతో ఈ రెండు స్టేషన్ల మద్య 173 కిమీ పొడవునా కొత్తగా మరో రెండు రైల్వే ట్రాక్స్ నిర్మించేందుకు రైల్వేశాఖ చేసిన ప్రతిపాదనకు నిన్న ప్రధాని మోడీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో ఆమోదం తెలిపారు.

దీనికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపి నిధులు విడుదల చేయబోతోంది కనుక రాబోయే 5 ఏళ్ళలో దీనిని పూర్తిచేయాలని రైల్వేశాఖ లక్ష్యంగా పెట్టుకుంది. 

ప్రస్తుతం ఉన్న రెండు లైన్లకు అధనంగా మరో రెండు రైల్వేలైన్లు అందుబాటులోకి వస్తే ముంబాయి-సికింద్రాబాద్‌ మద్య మరిన్ని కొత్త రైళ్ళు ప్రవేశపెట్టవచ్చు.

ఈ మార్గంలో 173 కిమీలలో 124కిమీ తెలంగాణ రాష్ట్రంలో, మిగిలిన 49 కిమీలు కర్ణాటకలో బీదర్‌లో ఉంటుంది. వికారాబాద్ నుంచి బీదర్ మద్య అనేక సిమెంట్, స్టీల్, వ్యవసాయ ఉత్పత్తుల కంపెనీలున్నాయి. కనుక ఈ మార్గంలో రైల్వేలైన్లు విస్తరణ జరిగితే సరుకు రవాణాకి కూడా మరింత వెసులుబాటు కలుగుతుంది. 

Related Post