దసరా, బతుకమ్మ పండగల సందర్భంగా ఈ నెల 21 నుంచి విద్యార్ధులకు సెలవులు మొదలవుతాయి. కనుక పండగలకు ఊర్లకు బయలుదేరేవారి సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ పండగల రద్దీని దృష్టిలో ఉంచుకొని టీజీఎస్ ఆర్టీసీ ఈ నెల 20 నుంచి అక్టోబర్ 2వరకు 7,754 స్పెషల్ బస్సులను నడిపించబోతోంది.
వీటిలో తెలంగాణ అంతరాష్ట్ర సర్వీసులో పాటు హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్రలకు బస్సులున్నాయి. ఈ ప్రత్యేక బస్సులతో పాటు పల్లె వెలుగు ప్రత్యేక బస్సులలో కూడా ప్రయాణికుల నుంచి 50 శాతం అదనపు ఛార్జీలు వసూలు చేయాలని టీజీఎస్ ఆర్టీసీ నిర్ణయించింది.
ఈ నెల 20,21 తేదీలలో మళ్ళీ ఈ నెల 30న సద్దుల బతుకమ్మ, దసరా పండగ, అక్టోబర్ 2 గాంధీ జయంతి సందర్భంగా రద్దీ మరింత ఎక్కువగా ఉండవచ్చని టీజీఎస్ ఆర్టీసీ అధికారులు అంచనా వేస్తున్నారు. కనుక ఈ నాలుగు రోజులలోనే 1,079 ప్రత్యేక బస్సులను నడిపించబోతున్నారు. పండగ సెలవులు ముగిసిన తర్వాత మళ్ళీ తిరుగు ప్రయాణాలు మొదలవుతాయి. కనుక అక్టోబర్ 5,6 తేదీలలో కూడా అదనపు బస్సులను నడిపించబోతున్నారు.
అదనపు ఛార్జీలు వసూలు చేయడంపై టీజీఎస్ ఆర్టీసీ అధికారులు ఏమన్నారంటే, పండగలకు నడిపించాబోయే ప్రత్యేక బస్సులు తిరుగు ప్రయాణంలో ఖాళీగా తిరిగిరాక తప్పదు. కనుక వాటి డీజిల్ ఖర్చుల కోసం అధనపు ఛార్జీలు తప్పడం లేదు. అయితే సిటీ బస్సులు, రెగ్యులర్ సర్వీసులలో టికెట్ ఛార్జీలలో ఎటువంటి పెంపు ఉండబోదని చెప్పారు.
హైదరాబాద్‌లో ఎంజీబీఎస్, జేబీఎస్ బస్టాండ్స్, ఉప్పల్ క్రాస్ రోడ్స్, ఉప్పల్ బస్టాండ్, దిల్‌సుఖ్ నగర్, ఎల్బీనగర్, ఆరాంఘర్, కెపీహెచ్‌బీ కాలనీ తదితర ప్రాంతాల నుంచి పండగ స్పెషల్ బస్సులు బయలుదేరేలా ఏర్పాట్లు చేస్తున్నామని టీజీఎస్ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ తెలిపారు.
ఈ పండగ స్పెషల్ బస్ సర్వీసులకు సంబంధించి వివరాల కోసం కాల్ సెంటర్ కూడా ఏర్పాటు చేశామని చెప్పారు. వీటి గురించి సమాచారం కొరకు 040-23450033, 040-69440000 నంబర్లకు ఫోన్ చేసి తెలుసుకోవచ్చని చెప్పారు.

బతుకమ్మ, దసరాకు టీజీఎస్ఆర్టీసీ 7754 ప్రత్యేక బస్సులు

ఈ నెల 20 నుంచి అక్టోబర్ 2 వరకు స్పెషల్ సర్వీసులు

ప్రజలను క్షేమంగా గమ్యస్థానాలకు చేర్చేలా ఏర్పాట్లు

బతుకమ్మ, దసరా పండుగల నేపథ్యంలో ప్రజలకు రవాణాపరమైన ఇబ్బందులు తలెత్తకుండా టీజీఎస్ఆర్టీసీ యాజమాన్యం ప్రత్యేక చ… pic.twitter.com/CNJ10IQXw6
— V.C. Sajjanar, IPS (@SajjanarVC) September 18, 2025