మారుతి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా ‘రాజాసాబ్’ ట్రైలర్ విడుదలకి దర్శక నిర్మాతలు ముహూర్తం పెట్టేశారు. రేపు (సోమవారం) సాయంత్రం 6 గంటలకు రాజాసాబ్ ట్రైలర్ విడుదల చేయబోతున్నట్లు సోషల్ మీడియాలో ప్రకటించారు. ఈ విషయం తెలియజేస్తూ పెట్టిన పోస్టర్‌లో రాజాసాబ్ తాత (ఆత్మ) పాత్రలో నటించిన బాలీవుడ్ సీనియర్ నటుడు సంజయ్ దత్, ప్రభాస్ ఉన్నారు.
ప్రముఖ నిర్మాత శ్రీనివాస్ కుమార్ ఇటీవల త్వరలో ‘రాజాసాబ్’ ఫస్ట్ సింగిల్ వస్తోందంటూ ఓ జిఐఎఫ్ పోస్ట్ చేశారు. దానిలో మంటలలో కాలిపోతున్న అస్థిపంజరం ఉంది. అంటే రాజసాబ్ అప్‌డేట్ కోసం అందరూ మంటల్లో కాలిపోతూ ఆస్థిపంజరాల్లా మారారని చెపుతున్నట్లనిపిస్తుంది. ఆయన ఏ ఉద్దేశ్యంతో అది పోస్ట్ చేసినప్పటికీ ఇంత వరకు రాజసాబ్ ఫస్ట్ సింగిల్ విడుదల చేయనే లేదు. దాని కంటే ముందుగా రేపు సాయంత్రం ట్రైలర్ వచ్చేస్తోంది.
పాన్ ఇండియా మూవీగా రాజాసాబ్ నిర్మిస్తున్నందున హిందీ బయ్యర్స్ అభ్యర్ధన మేరకు డిసెంబర్ 5 లేదా 6 తేదీలలో రిలీజ్ చేసే అవకాశం ఉందని నిర్మాత టీజీ విశ్వప్రసాద్ చెప్పారు.
ఈ సినిమాలో ప్రభాస్‌కు జోడీగా నిధి అగర్వాల్, మాళవిక మోహనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ ఓ ముఖ్య పాత్ర చేస్తున్నారు.
రాజాసాబ్ సినిమాకు సంగీతం: ఎస్ఎస్ తమన్, కెమెరా: కార్తీక్ పళని, ఆర్ట్ డైరెక్టర్: రాజీవన్, ఎడిటింగ్: కోటగిరి వేంకటేశ్వర రావు చేస్తున్నారు.
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో పాన్ ఇండియా మూవీగా నిర్మిస్తున్నారు.
The wait of millions finally comes to an end 💥💥#TheRajaSaabTRAILER will be out on September 29th at 6PM.
— People Media Factory (@peoplemediafcy) September 28, 2025
A ROYAL entry into a world of FUN, FEAR and a whole lot of Majestic Experiences ❤️🔥#TheRajaSaab #Prabhas @DuttSanjay @DirectorMaruthi @AgerwalNidhhi @MalavikaM_… pic.twitter.com/kBX8DfzL1H