విజయ్ సేతుపతి-పూరీ టైటిల్‌ టీజర్‌ రేపే!

September 27, 2025


img

టాలీవుడ్‌ దర్శకుడు పూరీ జగన్నాధ్, కోలీవుడ్‌ నటుడు విజయ్ సేతుపతి కలిసి చేయబోతున్న సినిమా టైటిల్‌ మొదట ‘బెగ్గర్’ అనుకున్నట్లు వార్తలు వచ్చాయి. ఆ పేరుతో సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలు కూడా ప్రత్యక్షమయ్యాయి. 

కానీ లైగర్ సినిమాతో కోలుకోలేని దెబ్బతిని ఆర్ధిక సమస్యలు ఎదుర్కొంటున్న పూరీ జగన్నాథ్ తన సినిమాకి అలాంటి పేరు పెట్టడంతో సోషల్ మీడియాలో విమర్శలు వచ్చాయి. దాంతో సినిమా పేరుని ‘భవతి భిక్షాం దేహి’గా మార్చారని వార్తలు వచ్చాయి. కానీ బెగ్గర్ కంటే ఇది మరీ దారుణంగా ఉందని విమర్శలు వినిపించాయి. 

కనుక దానినీ మార్చి ఫైనల్‌గా ‘స్లమ్‌ డాగ్’ అనే పేరు ఖరారు చేసినట్లు తెలుస్తోంది. రేపు (ఆదివారం) ఈ సినిమా టైటిల్‌, టీజర్‌ విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు కనుక అప్పుడే సినిమా టైటిల్‌పై పూర్తి స్పష్టత వస్తుంది.        

పూరీ, ఛార్మీలు తమ సొంత బ్యానర్ ‘పూరీ కనెక్ట్స్’తో పాన్ ఇండియా మూవీగా 5 భాషల్లో తీస్తున్న ఈ సినిమాలో విజయ్ సేతుపతి, టబు, రాధిక ఆప్టే, సంయుక్త ప్రధాన పాత్రలు చేస్తున్నారు. 


Related Post

సినిమా స‌మీక్ష