ఎటువంటి అంచనాలు లేకుండా కేవలం రూ.2.5 కోట్లు బడ్జెట్‌తో కొత్తగా వచ్చిన కుర్రకుంకలతో తీసిన ‘లిటిల్ హార్ట్స్’ సూపర్ హిట్ అయ్యింది. సెప్టెంబర్ 12న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా రెండు వారాలలోనే రూ.33 కోట్లు వసూలు చేసి నిర్మాతలకు కనకవర్షం కురిపించింది.
సాయి మార్తాండ్ దర్శకత్వంలో తనుజ్ ప్రశాంత్, శివాని నగరం జంటగా చేసిన ‘లిటిల్ హార్ట్స్’లో టీనేజ్ ప్రేమలు, కలజీ ముచ్చట్లతో యువత బాగా కనెక్ట్ అయ్యారు. ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ఎంజాయ్ చేశారు. ఇప్పుడీ సినిమా ఈటీవీ విన్ ఓటీటీలోకి రాబోతోంది. దసరా పండుగ సందర్భంగా ఒక రోజు ముందుగానే అక్టోబర్ 1నుంచి ఈటీవీ విన్ ఓటీటీలో ప్రసారం కాబోతోంది.
ఈ సినిమాలో రాజీవ్ కనకాల, సత్య కృష్ణ, ఎస్ఎస్ కంచి, అనితా చౌదరి తదితరులు ముఖ్యపాత్రలు చేశారు.
ఈ సినిమాకి కధ, దర్శకత్వం: సాయి మార్తాండ్ , సంగీతం: సంజిత్ ఎర్రమిల్లి, కెమెరా: సురియా బాలాజీ, ఎడిటింగ్: శ్రీధర్ సొంపల్లి చేశారు.
బన్నీ వాసు, వంశీ నందిపాటి ఎంటర్టెయిన్మెంట్ సమర్పణలో విన్ ఒరిజినల్ ప్రొడక్షన్ బ్యానర్‌పై ఆదిత్య హాసన్ ఈ ‘లిటిల్ హార్ట్స్’ని ప్రేక్షకులతో కలిపారు.