కానిస్టేబుల్ విషాదగీతం...

September 28, 2025


img

యువహీరో వరుణ్ సందేశ్, మధులిక వారణాసి జంటగా చేసిన ‘కానిస్టేబుల్’ అక్టోబర్ 10న విడుదల కాబోతోంది. ఆర్యన్ సుభాన్ ఎస్కే దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా టీజర్‌, ట్రైలర్‌, కొన్ని పాటలు ఇప్పటికే విడుదల చేయగా మంచి ఆదరణ లభిస్తోంది. తాజాగా ఈ సినిమా నుంచి ‘మా పంచ ప్రాణాలే...’ అంటూ సాగే తీవ్ర విషాదగీతాన్ని ప్రముఖ నటుడు ఆర్‌.నారాయణ మూర్తి హైదరాబాద్‌లో నేడు విడుదల చేశారు. ఎం.రామారావు వ్రాసిన ఈ పాటకు సుభాష్ ఆనంద్ సంగీతం అందించగా చంద్రబోస్ ఎంతో ఆర్తితో ఈ పాట పాడారు. 

ఈ సినిమాలో సూర్య, కల్పలత, మురళీధర్ మహేష్ కుమార్ గౌడ్‌, రవివర్మ, కషిష్ రాజ్ పుట్ తదితరులు ముఖ్యపాత్రలు చేశారు. 

ఈ సినిమాకి కధ, దర్శకత్వం: ఆర్యన్ సుభాన్ ఎస్కే, సంగీతం: సుభాష్ ఆనంద్,గ్యానీ;  కెమెరా: హజ్రతయ్య, ఎడిటింగ్: శ్రీవర ప్రసాద్, ఆర్ట్: వి.నాని పండు, కోరియోగ్రఫీ: భాను, విశ్వా రఘు, స్వర్ణ మాస్టర్, స్టంట్స్: రామ్‌ సుంకర చేశారు. 

జాగృతీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై బలగం జగదీష్, బి.నికిత జగదీష్, కుపేంద్ర పవార్ కలిసి ఈ సినిమా నిర్మించారు. అక్టోబర్ 10న ‘కానిస్టేబుల్’ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. 


Related Post

సినిమా స‌మీక్ష