ఆదివారం గ్రూప్-2 ఫలితాలు ప్రకటన?

September 27, 2025
img

తెలంగాణలో గ్రూప్-2లో 783 పోస్టుల భర్తీకి సంబంధించి ఫలితాలు రేపు (ఆదివారం) ప్రకటించే అవకాశం ఉంది. రేపు ఫలితాలు ప్రకటించి దసరా పండగ (అక్టోబర్ 2)లోగా ఎంపికైన అభ్యర్ధులకు నియామక పత్రాలు అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది.

ఈ ఏడాది మార్చిలో జనరల్ ర్యాంకులు ప్రకటించింది. వాటిలో అర్హత సాధించిన వారి ద్రువపత్రాల పరిశీలన పూర్తి చేసింది. యూనిఫారం పోస్టుల అభ్యర్ధులకు వైద్య పరీక్షలు కూడా నిర్వహించింది.

జనరల్ ర్యాంకింగ్‌లో అర్హత సాధించిన అభ్యర్ధుల విద్యార్హతలు, మెరిట్ ర్యాంక్, రిజర్వేషన్లు తదితర అంశాలను పరిగణనలోకి తుది జాబితా తయారు చేసి రేపు మధ్యాహ్నం ప్రకటించబోతోంది.

ఇటీవలే గ్రూప్-1 ఉద్యోగాల భర్తీకి హైకోర్టు గ్రీన్ సిగ్నల్‌ ఇచ్చింది. ఇప్పుడు వాటితో పాటు గ్రూప్-2 ఉద్యోగాల భర్తీ ప్రక్రియ కూడా ఒకేసారి పూర్తిచేయాలని ప్రభుత్వం భావిస్తోంది. కనుక గ్రూప్-1,2లో ఎంపికైన అభ్యర్ధులు, వారి కుటుంబ సభ్యులు ఈసారి దసరా, దీపావళి పండగలు మరింత సంతోషంగా జరుపుకోవచ్చు. 

Related Post