హైదరాబాద్‌ మెట్రో ఇక రాత్రి 11 వరకే

November 01, 2025
img

ఈ నెల 3వ తేదీ నుంచి హైదరాబాద్‌ మెట్రో రైల్ సమయంలో చిన్న మార్పు చేస్తున్నట్లు మెట్రో అధికారులు ప్రకటించారు. ప్రస్తుతం సోమవారం నుంచి శుక్రవారం వరకు ప్రతీరోజూ ఉదయం 6 గంటలకు మొదటి సర్వీసు మొదలవుతుంది. రాత్రి 11.45 గంటలకు చివరి సర్వీసు ఉంటుంది. శనివారంనాడు ఉదయం 6 గంటలకు, రాత్రి 11.00 గంటలకు, ఆదివారం ఉదయం 7 గంటలకు, రాత్రి 11.00 గంటలకు చివరి సర్వీస్ ఉంది.

కానీ ఇక నుంచి ప్రతీరోజూ 6 గంటల నుంచి మొదలై రాత్రి 11.00 గంటలకు చివరి మెట్రో రైల్ ఉంటుందని తెలిపారు.  పండుగ రోజులు, ఇతర సెలవు దినాలతో సహా ప్రతీరోజూ ఇదే సమయంలో నడుస్తాయని మెట్రో అధికారులు తెలిపారు. ఈ నెల 3 నుంచి నగరంలో గల అన్ని మెట్రో స్టేషన్లలో ఈ సదుపాయం అందుబాటులోకి వస్తుందని కనుక ప్రయాణికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మెట్రో అధికారులు కోరారు. 


Related Post