నేడు బీహార్ శాసనసభ ఎన్నికలలో తొలిదశ పోలింగ్ జరుగబోతోంది. మొత్తం 243 స్థానాలలో నేడు 18 జిల్లాలలోని 121 స్థానాలకు పోలింగ్ జరుగబోతోంది. ఈ 121 స్థానాలకు 1,314 మంది అభ్యర్ధులు పోటీ పడుతున్నారు. వారి భవిష్యత్ తొలి దశ పోలింగులో 3.75 కోట్ల మంది ఓటర్ల చేతిలో ఉండిప్పుడు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగబోతోంది.
తొలిదశ పోలింగ్ కొరకు ఎన్నికల సంఘం మొత్తం 45,241 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసింది. వీటిలో 36 ,733 గ్రామీణ ప్రాంతాలలోనే ఉన్నాయి.
2020లో జరిగిన బీహార్ శాసనసభ ఎన్నికలలో ఈ 18 జిల్లాలలో బీజేపీ-నితీశ్ కుమార్ కూటమి 70 సీట్లు గెలుచుకొంది. ఈసారి అదనంగా మరో 17-18 సీట్లు గెలుచుకోగలమని ధీమాగా ఉన్నాయి. కానీ ఈసారి ప్రశాంత్ కిషోర్ జన్ సూరజ్ పార్టీలో బరిలో దిగడంతో ఎన్డీఏ, ఇండియా కూటమి ఓట్లు చీలిపోయే ప్రమాదం పొంచి ఉంది.
రెండవ చివర విడత ఎన్నికలు నవంబర్ 11న జరుగబోతున్నాయి. అదే రోజున జూబ్లీహిల్స్‌తో పాటు దేశవ్యాప్తంగా వివిద రాష్ట్రాలలో కూడా ఉప ఎన్నికలు జరుగుతాయి. నవంబర్ 14న ఓట్లు లెక్కించి ఫలితాలు వెల్లడిస్తారు.