మహాప్రయాగ్ కుంభమేళాలో పూసలు అమ్ముకుంటున్న అందమైన అమ్మాయి మొనాలిసా భోస్లేని అదృష్టం వరించింది. ఓ బాలీవుడ్ దర్శకుడు ఆమెను హీరోయిన్‌గా పెట్టి సినిమా తీయాలనుకున్నారు. కానీ కుదరలేదు. ఇప్పుడు ఆమెకు తెలుగు సినీ పరిశ్రమ ‘లైఫ్’ ఇవ్వబోతోంది.
శ్రీను కోటపాటి దర్శకత్వంలో సాయిచరణ్ హీరోగా తీస్తున్న ‘లైఫ్’ సినిమాలో ఆమెను హీరోయిన్‌గా తీసుకున్నారు. శ్రీ వెంగమాంబ క్రియేషన్స్ బ్యానర్‌పై అంజయ్య ఈ సినిమా నిర్మిస్తున్నారు. బుధవారం ఈ సినిమా పూజా కార్యక్రమంలో హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్స్ లో జరిగింది. ప్రముఖ రాజకీయ నాయకుడు గుత్తా సుఖేందర్ రెడ్డి కొబ్బరికాయ కొట్టి లాంఛనంగా షూటింగ్ ప్రారంభించారు.
అనంతరం నిర్మాత అంజయ్య మాట్లాడుతూ యావత్ దేశ ప్రజల దృష్టిని ఆకర్షించిన మొనాలిసా భోస్లేతో సినిమా తీయాలనుకున్నప్పుడు దర్శకుడు శ్రీను కలిసి ఓ కధ చెప్పారు. సాఫ్ట్ వేర్ ఉద్యోగుల జీవితాలలో జరిగే ఘటనలను మా ఈ లైఫ్ సినిమా ద్వారా చూపించబోతున్నాము. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ మొదలుపెడతాము,” అని అన్నారు.
మొనాలిసా భోస్లే మీడియాతో మాట్లాడుతూ, “ఈ సినిమాలో నటించే అవకాశం లభించడంతో నేను తొలిసారిగా హైదరాబాద్ వచ్చాను. నాకు చాలా ఆనందంగా ఉంది. నాకు తెలుగు రాదు కానీ త్వరలోనే నేర్చుకుంటాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు ధన్య వాదాలు తెలుపుకుంటున్నాను,” అని అన్నారు.