శివ రీ-రిలీజ్ ట్రైలర్‌

November 05, 2025


img

అక్కినేని నాగార్జున సినీ పరిశ్రమలో నిలద్రొక్కుకోవడానికి ప్రయత్నిస్తున్న రోజుల్లో అంటే సుమారు 36 సంవత్సరాల క్రితం కొత్తగా ఇండస్ట్రీలోకి ప్రవేశించిన దర్శకుడు రాంగోపాల్ వర్మతో ‘శివ’ చేశారు. అది సూపర్ డూపర్ హిట్ అయ్యింది. వారిద్దరికీ మంచి పేరు ప్రతిష్టలు తెచ్చిపెట్టింది. ఇన్నేళ్ళ తర్వాత ‘శివ’ మళ్ళీ వస్తున్నాడు. 

ఇప్పుడు అందుబాటులోకి వచ్చిన అత్యాధునిక టెక్నాలజీతో ఈ సినిమా ఆడియో, వీడియో క్వాలిటీని మరింత మెరుగు పరిచి ఈ నెల 14న ‘శివ’ విడుదల చేస్తున్నామని రాంగోపాల్ వర్మ చెప్పారు. ఈ సందర్భంగా ఆయన, అక్కినేని నాగార్జునతో కలిసి హైదరాబాద్‌లో శివ రీ-రిలీజ్ ట్రైలర్‌ విడుదల చేశారు.

 ట్రైలర్‌లో ప్రభాస్‌, మహేష్ బాబు, అల్లు అర్జున్‌, జూ.ఎన్టీఆర్‌ తదితర పలువురు స్టార్ హీరోలు, దర్శకుడు నాగ్ అశ్విన్ వంటివారు శివ గురించి తమ అభిప్రాయాలను ప్రేక్షకులతో పంచుకున్నారు.  

ఈ సినిమాలో అక్కినేని నాగార్జున, అమల జంటగా నటించగా జేడీ చక్రవర్తి, తనికెళ్ళ భరణి, రఘువరన్, శుభలేఖ సుధాకర్ తదితరులు ముఖ్యపాత్రలు చేశారు.   

ఈ సినిమాకి కధ, దర్శకత్వం, స్క్రీన్ ప్లే: రాంగోపాల్ వర్మ, డైలాగ్స్: తనికెళ్ళ భరణి, సంగీతం: ఇళయరాజా, కెమెరా: ఎస్.గోపాల్ రెడ్డి, ఎడిటింగ్: సత్తిబాబు చేశారు. 

అన్నపూర్ణా స్టూడియోస్ బ్యానర్‌పై అక్కినేని వెంకట్, యార్లగడ్డ సురేంద్ర కలిసి ఈ సినిమా నిర్మించారు. 


Related Post

సినిమా స‌మీక్ష