అమెజాన్ ప్రైమ్‌ టీవీలోకి మిత్రమండలి

November 05, 2025


img

ప్రియదర్శి, నిహారిక ప్రధాన పాత్రలలో నటించిన ‘మిత్రమండలి’ అక్టోబర్‌ 16న థియేటర్లలో విడుదలయ్యింది. కానీ మిశ్రమ స్పందన రావడంతో బోర్లా పడింది. ఇప్పుడీ సినిమా ఈ నెల 6 నుంచి అమెజాన్ ప్రైమ్‌ టీవీ ఓటీటీలోకి వచ్చేస్తోంది.

కుల పిచ్చి ముదిరిపోయిన ఓ వ్యక్తి (విటివి గణేశ్) కూతురు (నిహారిక) వేరే కులం వాడితో లేచిపోతే ఏమవుతుంది. అదీ... ఆ ఊళ్ళోనే అల్లరి చిల్లరగా తిరిగే వాడితో లేచిపోతే తర్వాత ఏమవుతుందనేదే ఈ సినిమా కధ.

కులం పిచ్చిపై వ్యంగ్యంగా సినిమా తీయడం అభినందనీయమే. దర్శకుడు విజయేందర్ చాలా చక్కటి కధాంశం ఎంచుకున్నప్పటికీ దానిని తెరపై ఆవిష్కరించడంలో తడబడ్డారు. పైగా రివ్యూలు కూడా ఈ సినిమా థియేటర్లలో నిలద్రొక్కుకోక ముందే చంపేశాయి.

ఇప్పుడు ఓటీటీకి వస్తోంది కనుక ఓటీటీ ప్రేక్షకులు కూడా ఈ సినిమా చూసి ఎక్కడ లోపం జరిగిందో తెలుసుకోవచ్చు. 



Related Post

సినిమా స‌మీక్ష