వెంకట్ కల్యాణ్ దర్శకత్వంలో సుధీర్ బాబు హీరోగా చేస్తున్న ‘జటాధర’ నవంబర్ 7న విడుదల కాబోతోంది. కనుక సినిమా విడుదలకు ముందు రిలీజ్ ట్రైలర్ అంటూ నేడు మరో ట్రైలర్ విడుదల చేశారు. దెయ్యాలు, భూతాలు, ఆత్మలు లేవని గట్టిగా నమ్మే హీరో వాటిని ఎదురించే క్రమంలో శివ భక్తుడుగా మారి పోరాడుతాడు. ఈ సినిమాలో గుప్త నిధులకు కాపలాగా తాంత్రిక విద్యతో బందీ చేయబడిన ధన పిశాచిగా బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా నటించారు.
జటాధరలో రైన్ అంజలి, శిల్పా శిరోడ్కర్, రాజీవ్ కనకాల, శుభలేఖ సుధాకర్, ఝాన్సీ, శ్రేయ శర్మ, నవీన్ నేని, ఇందిరా కృష్ణ రవి ప్రకాష్ తదితరులు ముఖ్యపాత్రలు చేస్తున్నారు.
జీ స్టూడియో బ్యానర్‌పై ఉమేశ్ కె.ఆర్.భన్సాల్, ప్రేరణ అరోరా కలిసి నిర్మిస్తున్న జటాధరకు కధ: వెంకట్ కళ్యాణ్, దర్శకత్వం: వెంకట్ కళ్యాణ్, అభిషేక్ జైస్వాల్ చేశారు.