రమణీ కల్యాణం: టైటిల్‌ పోస్టర్‌ భేష్!

November 07, 2025


img

విజయ్ ఆదిరెడ్డి దర్శకత్వంలో  సూర్య వశిష్ట, దీప్షిక జంటగా చేస్తున్న సినిమాకి రమణీ కల్యాణం అని టైటిల్‌ ఖరారు చేసి నేడు ఒకేసారి రెండు టైటిల్‌ పోస్టర్స్ విడుదల చేశారు. రెండూ చాలా నీట్ అండ్ సింపుల్‌గా ఉన్నాయి. నిత్య జీవితంలో ఎదురయ్యే సమస్యలు, సవాళ్ళ మద్య భార్యాభర్తల మద్య ప్రేమానుబంధాలు నిలుపుకోవడం చాలా గొప్ప విషయం. ఈ నేపధ్యంలో భావోద్వేగాలు, విలువలు, వినోదంతో ఈ సినిమా తెరకెక్కించబోతున్నట్లు దర్శకుడు విజయ్ ఆదిరెడ్డి చెప్పారు. త్వరలోనే టీజర్‌, ట్రైలర్‌, పాటలు విడుదల చేస్తామని చెప్పారు. 

ఈ సినిమాకి దర్శకత్వం: విజయ్ ఆదిరెడ్డి, సంగీతం: సూరజ్ ఎస్ కురుప్, కెమెరా: అరవింద్ తిరుకోవెల, స్క్రీన్ ప్లే, డైలాగ్స్: రామ్ జగదీష్ చేస్తున్నారు. 



Related Post

సినిమా స‌మీక్ష