సంగారెడ్డిలో రోడ్ ప్రమాదం... నిద్రమత్తు, అతివేగమే కారణం?

November 09, 2025
img

సంగారెడ్డిలో ఆదివారం తెల్లవారుజామున రోడ్ ప్రమాదం జరిగింది. కంది పరిధిలో కవలంపేట సమీపంలో ఆర్టీసీ బస్సును వెనుక నుంఛి తుఫాన్ వ్యాన్ బలంగా డీకొట్టింది. ఈ ప్రమాదంలో వ్యాన్ నడుపుతున్న బాలయ్య (52) అక్కడికక్కడే మృతి చెందగా,  వ్యానులో ప్రయాణిస్తున్న ప్రవీణ్, ఫరీద్ సీతారం, కాలప్ప తదితరులు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన అక్కడకు చేరుకొని క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. 

మృతుడు బాలయ్య నారాయణఖేడ్ జిల్లా చాంద్ షారూక్‌ ఖాన్‌ పల్లికి చెందినవారు కాగా, క్షతగాత్రులలో ప్రవీణ్ తూఫ్రాన్ మండలం అల్లాపూర్, ఫరీద్ న్యాల్కల్ మండలం రత్నాపూర్, సీతారం సిర్గాపూర్, కాలప్ప రాయచూరుకి చెందినవారిగా పోలీసులు గుర్తించారు. 

డ్రైవర్ నిద్రమత్తుతో అతివేగంగా వాహనం నడుపుతుండటం వలననే ఈ ప్రమాదం సంభవించినట్లు పోలీసులు ప్రాధమిక దర్యాప్తులో నిర్ధారించారు. పోలీసులు కేసు నమోదు చేశారు. 

Related Post