జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారం మరో రెండు గంటల్లో ముగియబోతోంది. ఈ సందర్భంగా తెలంగాణ బీజేపి అధ్యక్షుడు ఎన్ రామచంద్ర రావు మీడియాతో మాట్లాడుతూ, “కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీ రెండూ మతం ఆధారంగా ఓట్లు అడుగుతున్నాయి.
కాంగ్రెస్ పార్టీ ముస్లింల ఓట్లపై దృష్టి పెడితే బీఆర్ఎస్ పార్టీ క్రీస్టియన్ ఓటర్లపై దృష్టి పెట్టింది. రెండు పార్టీలు నియోజకవర్గం జనాభాలో 20 శాతం ఉన్న మైనార్టీ ఓట్లు లభిస్తే చాలనుకుంటున్నాయి. కనుక మిగిలిన 80 శాతం హిందూ ఓటర్లు బీజేపికి ఓట్లు గెలిపించాలని విజ్ఞప్తి చేస్తున్నాను.
బీఆర్ఎస్ పార్టీ పదేళ్ళు, కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో దాదాపు రెండేళ్ళుగా అధికారంలో ఉన్నాయి. కానీ రెండు పార్టీలు జూబ్లీహిల్స్ అభివృద్ధిని పట్టించుకోలేదు. నియోజకవర్గంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పట్టించుకోలేదు.
బీఆర్ఎస్ అభ్యర్ధిని గెలిపించినా ఆమె అదే పార్టీలో కొనసాగుతారనే నమ్మకం లేదు. కనుక వాటిలో దేనికి వేసినా ఉపయోగం ఉండదు. అదే... బీజేపి అభ్యర్ధి లంకెల దీపక్ రెడ్డిని గెలిపిస్తే అయన మీకు అందుబాటులో ఉంటారు. ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తారు,” అని ఎన్ రామచంద్ర రెడ్డి అన్నారు.